హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాల జాతర... త్వరలో 3,00,000 పైగా ఖాళీల భర్తీ

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాల జాతర... త్వరలో 3,00,000 పైగా ఖాళీల భర్తీ

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాల జాతర... త్వరలో 3,00,000 పైగా ఖాళీల భర్తీ
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాల జాతర... త్వరలో 3,00,000 పైగా ఖాళీల భర్తీ (ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs | గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లతో పాటు కొత్త నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 3 లక్షలకు పైగా ఖాళీలు భర్తీ చేయనున్నట్టు రైల్వే మంత్రి పార్లమెంట్‌కు తెలిపారు.

  మీరు రైల్వే ఉద్యోగానికి అప్లై చేశారా? 2018-19 మధ్య రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారా? పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారా? రైల్వే జాబ్‌కు అప్లై చేయాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. రైల్వేలో వచ్చే ఏడాది భారీగా ఉద్యోగాల భర్తీ జరగబోతోంది. 2020 సంవత్సరంలో 3 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ చేయబోతోంది రైల్వే శాఖ. అంతే కాదు... ఇప్పటివరకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB పరీక్షల ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. 2020 జనవరిలోనే ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ విషయాలను రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌కు రాతపూర్వకంగా వెల్లడించారు. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లతో పాటు కొత్త నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 3 లక్షలకు పైగా ఖాళీలు భర్తీ చేయనున్నట్టు రైల్వే మంత్రి పార్లమెంట్‌కు తెలిపారు.

  మొత్తం 3,00,000 పైగా పోస్టుల్లో 2,621 పోస్టులు గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్ కాగా 3,03,606 పోస్టులు నాన్-గెజిటెడ్ లెవెల్ స్థాయిలో భర్తీ చేస్తారు. 2018, 2019 సంవత్సరాల్లో నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ పోస్టులు కూడా ఇందులో కలిపే ఉంటాయి. 2018, 2019 నోటిఫికేషన్లలో ఇప్పటికే 74,507 పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. మిగతా ప్యానెల్స్ ఫలితాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. 36,871 గ్రూప్ సీ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, వచ్చే ఏడాది పూర్తవుతుందని, 1,03,769 లెవెల్ 1 పోస్టులకు 2019 సంవత్సరంలో నోటిఫికేషన్ విడుదల చేశామని, 1.15 కోట్ల దరఖాస్తులు వచ్చాయని పీయూష్ గోయల్ వెల్లడించారు. ఇప్పటికే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష షెడ్యూల్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

  మొత్తం 2,83,674 పోస్టుల భర్తీకి 2018-2019 మధ్య పరీక్షలు జరిగాయి. అందులో 2018లో 77,909 గ్రూప్ సీ పోస్టులు, 63,202 లెవెల్ 1 పోస్టులు, 2019లో 38,794 గ్రూప్ సీ పోస్టులు, 1,03,768 లెవెల్ 1 పోస్టులున్నట్టు పీయూష్ గోయల్ తెలిపారు.

  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Realme X2: రియల్‌మీ ఎక్స్2 రిలీజ్... ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  Railway Jobs: రైల్వేలో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

  ISRO Jobs 2019: మరో 63 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన ఇస్రో

  Coal India Jobs: బీటెక్ పాసైనవారికి గుడ్ న్యూస్... కోల్ ఇండియా లిమిటెడ్‌లో 1326 జాబ్స్

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Piyush Goyal, Railway Apprenticeship, Railway employees, Railways, Results, RRB

  ఉత్తమ కథలు