హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: గుడ్ న్యూస్...1,40,640 రైల్వే ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ఎప్పుడంటే?

Railway Jobs: గుడ్ న్యూస్...1,40,640 రైల్వే ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ఎప్పుడంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Indian Railways Jobs: భారత రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపి కబురు. రైల్వే శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి గత కొన్ని మాసాలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది.

  భారత రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపి కబురు. రైల్వే శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి గత కొన్ని మాసాలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. రైల్వే శాఖలో ఖాళీల 1,40,640 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి 2.42 కోట్ల మంది అభ్యర్థులు ఈ ఏడాది మొదట్లో దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో ఉద్యోగానికి 172 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి డిసెంబర్ 15 తర్వాత ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు రైల్వే శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(RRB) అధికారులు...ప్రవేశ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.

  దేశంలో కరోనా విజృంభించటానికి ముందుగా మూడు కేటిగిరీలకు సంబంధించి రైల్వే శాఖ నోటిఫికేషన్లు విడుదల చేయగా...వీరు వాటికి దరఖాస్తు చేసుకున్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో రైల్వే శాఖ పరీక్షలు నిర్వహించలేకపోయింది.

  Railway Jobs 2020, RRB Jobs 2020, Railway Paramedical Jobs 2020, Indian Railways Recruitment 2020, Coronavirus pandemic, Covid 19, రైల్వే ఉద్యోగాలు 2020, ఆర్ఆర్‌బీ ఉద్యోగాలు 2020, రైల్వే పారామెడికల్ ఉద్యోగాలు, రైల్వే జాబ్స్, కోవిడ్ 19, కరోనా వైరస్ మహమ్మారి
  ప్రతీకాత్మక చిత్రం

  గార్డులు, ఆఫీస్ క్లర్స్, కమర్షికల్ క్లర్క్స్ తదితర నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC)లో 35,208 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉండగా...ఐసొలేటెడ్ మరియు మినిస్టీరియల్ కేటగిరీ(స్టెనో, టీచర్స్)లో 1,663 ఉద్యోగ ఖాళీలు, ట్రాక్ మెయింటైనర్స్, పాయింట్స్‌మెన్ తదితర లెవల్ 1 కేటగిరీలో 1,03,769 ఉద్యోగ ఖాళీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఆర్ఆర్‌బీ) భర్తీ చేయనుంది.

  ఈ పరీక్షలకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను రైల్వే బోర్డు విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల తరహాలోనే ఈ పరీక్షల నిర్వహణకు రైల్వే బోర్డు మార్గదర్శకాలు రూపొందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

  Published by:Janardhan V
  First published:

  Tags: Indian Railways, RRB

  ఉత్తమ కథలు