Indian Railways: విద్యార్థులకు భారతీయ రైల్వే నుంచి అద్భుత అవకాశం

Indian Railways Summer Internship | జోనల్ రైల్వేలు, ప్రొడక్షన్ యూనిట్లు, భారతీయ రైల్వేకు చెందిన అనుబంధ సంస్థలు నిర్వహించే సమ్మర్ ఇంటర్న్‌షిప్ రెండు నెలలు ఉంటుంది.

news18-telugu
Updated: January 21, 2020, 4:21 PM IST
Indian Railways: విద్యార్థులకు భారతీయ రైల్వే నుంచి అద్భుత అవకాశం
Indian Railways: విద్యార్థులకు భారతీయ రైల్వే నుంచి అద్భుత అవకాశం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
డిగ్రీ పాసైనవారికి భారతీయ రైల్వే అద్భుతమైన అవకాశం అందించబోతోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా సమ్మర్ ఇంటర్న్‌షిప్ నిర్వహించే అవకాశముంది. 2015 నుంచి ప్రతీ ఏటా సమ్మర్ ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తోంది ఇండియన్ రైల్వేస్. ఇంజనీరింగ్‌లో డిగ్రీ, పీజీ, ఎంబీఏ చదువుతున్న విద్యార్థులు సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. లాజిస్టిక్స్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, హెచ్ఆర్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఇతర సాంకేతిక అంశాలు నేర్చుకునేందుకు విద్యార్థులకు అవకాశం లభిస్తుంది. జోనల్ రైల్వేలు, ప్రొడక్షన్ యూనిట్లు, భారతీయ రైల్వేకు చెందిన అనుబంధ సంస్థలు నిర్వహించే సమ్మర్ ఇంటర్న్‌షిప్ రెండు నెలలు ఉంటుంది.

సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది భారతీయ రైల్వే. ఇంటర్న్‌షిప్ పూర్తైన తర్వాత సబ్జెక్ట్‌పై రిపోర్ట్ లేదా పేపర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ లభిస్తుంది. ఇంటర్న్‌షిప్ సమయంలో ఎలాంటి పారితోషికం, వసతి సౌకర్యాలు ఉండవు. ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ, ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్‌మెంట్ లాంటి కోర్సులు చేస్తున్నవారికి ఇండియన్ రైల్వేస్ నిర్వహించే సమ్మర్ ఇంటర్న్‌షిప్ మంచి అవకాశం. గతేడాది ఏప్రిల్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రకటించింది రైల్వే. ఈ ఏడాది సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను రైల్వే త్వరలో ప్రకటించే అవకాశముంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SBI Jobs: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలు... ఎగ్జామ్ సిలబస్ ఇదే

Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

Bank Jobs: బ్యాంకు ఉద్యోగం కావాలా? ఈ నోటిఫికేషన్లకు అప్లై చేయండి
Published by: Santhosh Kumar S
First published: January 21, 2020, 4:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading