హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB Recruitment: రైల్వేలో వివిధ పోస్టులకు 57,117 మంది షార్ట్‌లిస్ట్.. వీరిలో 4,368 మంది మహిళా అభ్యర్థులు..! 

RRB Recruitment: రైల్వేలో వివిధ పోస్టులకు 57,117 మంది షార్ట్‌లిస్ట్.. వీరిలో 4,368 మంది మహిళా అభ్యర్థులు..! 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత రైల్వేలో స్టేషన్ మాస్టర్స్, రైల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) రెండో రౌండ్ కోసం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించింది. మొత్తంగా 1.27 లక్షల మంది పరీక్ష రాయగా 57,117 మంది మూడు, నాలుగో రౌండ్‌కు ఎంపికయ్యారు.

ఇంకా చదవండి ...

భారత రైల్వేలో స్టేషన్ మాస్టర్స్, రైల్ అసిస్టెంట్ పోస్టుల (Jobs) భర్తీ కోసం ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) రెండో రౌండ్ కోసం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBT) నిర్వహించింది. మొత్తంగా 1.27 లక్షల మంది పరీక్ష రాయగా 57,117 మంది మూడు, నాలుగో రౌండ్‌కు ఎంపికయ్యారు. ఇందులో 4,368 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని ఓ నివేదిక వెల్లడించింది. పరీక్షలో అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే నివేదించడానికి అభ్యర్థులకు మే13 నుంచి 16వ తేదీ వరకు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. లెవల్ 6 స్టేషన్ మాస్టర్ పోస్టు కోసం 6,865 ఖాళీలను నోటిఫై చేయగా 55,787 మంది షార్ట్‌లిస్ట్ అయ్యారు. అదే ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్ట్‌కు లెవల్ 4లో 161 ఖాళీలను నోటిఫై చేయగా, 1330 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు.

CBT పరీక్ష ఫలితాలను అభ్యర్థులు పొందిన వాస్తవ స్కోర్‌ల ఆధారంగా ప్రకటించారు. మూడు, ఫైనల్ రౌండ్ తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) త్వరలో ప్రకటించనుంది. స్టేషన్ మాస్టర్ పోస్ట్ కోసం చివరి రౌండ్ తర్వాత ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు. అయితే ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్ట్‌కు ఎంపికైన అభ్యర్థులను కోల్‌కతా మెట్రోకు మాత్రమే పరిమితం చేయనున్నారు.

Railway Jobs 2022: నిరుద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. రైల్వేలో 1.48 లక్షల ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ఆర్‌ఆర్‌బీ పే లెవల్స్ 2, 3, 5 ఖాళీల భర్తీకి నిర్వహించే CBT 2 పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. సంస్థ అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.inలో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భువనేశ్వర్, చండీగఢ్, గోరఖ్‌పూర్, రాంచీ, బిలాస్‌పూర్, సికింద్రాబాద్, ముజఫర్‌పూర్, ముంబై నగరాల్లో లెవల్ 5 కోసం ఆర్‌ఆర్‌బీ CBT-2 పరీక్షను జూన్ 12న నిర్వహిస్తుంది. జూన్ 13, 14 తేదీల్లో లెవల్ 2, 3 కోసం పరీక్షలు జరగనున్నాయి.

Railway Recruitment 2022: నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే శుభవార్త.. టెన్త్ అర్హతతో 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

ఇక భోపాల్, చెన్నై, జమ్మూ-శ్రీనగర్, గౌహతి, అజ్మీర్, బెంగళూరు, కోల్‌కతా, సిలిగురి, అహ్మదాబాద్, ప్రయాగ్‌రాజ్, తిరువనంతపురం, మాల్దాలలో లెవల్ 5 పరీక్షలు జూన్ 15న జరుగుతాయి. పే లెవల్ 2, 3 కోసం జూన్ 16, 17 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రేడ్ B ఫేజ్ 2 అడ్మిట్ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ rbi.org.in ద్వారా వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 25, 2022న జరగనున్న DR ఫేజ్ 2 పరీక్ష కోసం అభ్యర్థులు ఈ అడ్మిట్ కార్డులను రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ సాయంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష హాలులోకి అనుమతించాలంటే అభ్యర్థులు అడ్మిట్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.

First published:

Tags: JOBS, Railway jobs, South Central Railways

ఉత్తమ కథలు