Railways: అమ్మాయిలు రైల్వే పరీక్ష రాస్తే ఫీజు వాపస్ ఇస్తున్నాం: పీయూష్ గోయల్

Railways | ఇన్నాళ్లూ పురుషులకు మాత్రమే అనుకున్న ఉద్యోగాలకు ఇప్పుడు మహిళలు పోటీ పడుతుండటం విశేషం.

news18-telugu
Updated: June 27, 2019, 5:58 PM IST
Railways: అమ్మాయిలు రైల్వే పరీక్ష రాస్తే ఫీజు వాపస్ ఇస్తున్నాం: పీయూష్ గోయల్
Railways: అమ్మాయిలు రైల్వే పరీక్ష రాస్తే ఫీజు వాపస్
news18-telugu
Updated: June 27, 2019, 5:58 PM IST
రైల్వేలో టెక్నికల్ కేటగిరీ పోస్టులకు అమ్మాయిలు పోటీపడుతున్నారు. గత 3 ఏళ్లలో 3,650 మంది మహిళల్ని టెక్నికల్ కేటగిరీల్లో నియమించామని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌కు తెలిపారు. రైల్వే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న మహిళలు, పరీక్షకు హాజరైతే అప్లికేషన్ ఫీజు వెనక్కి ఇస్తున్నట్టు చెప్పారు పీయూష్ గోయల్. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు, భర్త నుంచి విడిపోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోని వారికి రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వయస్సును 35 ఏళ్లకు పొడిగించినట్టు చెప్పారు. లెవెల్-1 కేటగిరీల్లో అర్హతల విషయంలోనూ మహిళలకు పీఈటీ నిబంధనల్ని సడలించామని చెప్పారు. రైల్వేలో రైల్వే స్టేషన్లలో మహిళలు పనిచేసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేకంగా రెస్ట్ రూమ్స్, క్లాక్ రూమ్స్, ఛేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేశామన్నారు.

భారతీయ రైల్వేలో అన్ని విభాగాల్లో ఉద్యోగాలకు పోటీపడే మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని లెక్కలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లలో రైల్వేలో ఉద్యోగాల కోసం మొత్తం 2,79,60,224 దరఖాస్తులు వస్తే వాటిలో 16.73 శాతం అంటే 46,76,928 దరఖాస్తులు మహిళలవేనని పీయూష్ గోయల్ తెలిపారు. అంతేకాదు... ఇటీవల లోకోపైలట్‌తో పాటు ఇతర టెక్నికల్ కేటగిరీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మహిళల సంఖ్య ఐదు లక్షలకు పైనే ఉందని అంచనా. ఇన్నాళ్లూ పురుషులకు మాత్రమే అనుకున్న ఉద్యోగాలకు ఇప్పుడు మహిళలు పోటీ పడుతుండటం విశేషం. రైల్వే కూడా మహిళల్ని ప్రోత్సహించే చర్యలు తీసుకుంటుండటంతో దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య పెరుగుతోంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి




ఇవి కూడా చదవండి:

Free Wifi: రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై వాడుకోండి ఇలా

Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో 84,037 ఖాళీలు భర్తీ చేయనున్న కేంద్రం

Jobs: ఆ రంగంలో కొత్తగా 1,49,000 ఉద్యోగాలు
First published: June 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...