Railway Course: విద్యార్థుల కోసం కొత్త కోర్సు ప్రకటించిన భారతీయ రైల్వే

Indian Railways | నేషనల్ రైల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్-NRTI యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌తో ఒప్పందం కుదుర్చుకొని కొత్త కోర్సు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సు అందించనుంది.

news18-telugu
Updated: February 24, 2020, 11:34 AM IST
Railway Course: విద్యార్థుల కోసం కొత్త కోర్సు ప్రకటించిన భారతీయ రైల్వే
Railway Course: విద్యార్థుల కోసం కొత్త కోర్సు ప్రకటించిన భారతీయ రైల్వే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ రైల్వేలో మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకునేవారికి శుభవార్త. భారతీయ రైల్వే విద్యార్థుల కోసం సరికొత్త కోర్సును ప్రకటించింది. ఇందుకోసం బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌ ఛాన్స్‌లర్ కరన్ బిల్లిమోరియా కలిసి 'జాయింట్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇన్ రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్' కోర్సును ప్రకటించారు. 2020-2021 విద్యాసంవత్సరం నుంచే ఈ కోర్సును అందించనుంది నేషనల్ రైల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్-NRTI. ఈ కోర్సును ఎంచుకునే విద్యార్థులు ఒక్కో విద్యా సంస్థలో ఒక ఏడాది చొప్పున చదవాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసినవారికి డ్యూయెల్ మాస్టర్ ఆఫ్ సైన్స్-MSc సర్టిఫికెట్ వస్తుంది. అంటే రెండు విద్యా సంస్థల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు లభిస్తాయి.


నేషనల్ రైల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో కొత్త పీజీ కోర్సుతో పాటు మరిన్ని కోర్సుల్ని అందించనుంది యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌. కొన్ని మాడ్యూల్స్‌లో ఆన్‌లైన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ కోర్సు అందించనుంది. ఎన్‌ఆర్‌టీఐలో యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌ ఫ్యాకల్టీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. బర్మింగ్‌హామ్‌ సెంటర్ ఫర్ రైల్వే రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్-BCRRE ద్వారా ఎన్‌ఆర్‌టీఐ విద్యార్థులకు ప్రపంచ స్థాయి నిపుణుల గైడెన్స్, సదుపాయాలు లభిస్తాయి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఇవి కూడా చదవండి:

CTET July 2020: టీచర్ కావాలనుకునేవారికి గుడ్ న్యూస్... సీటెట్ 2020 గడువు పెంపు

UPSC Jobs 2020: యూపీఎస్‌సీ నుంచి 886 పోస్టుల భర్తీ... అప్లై చేయండిలా

Andhra Pradesh Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు
Published by: Santhosh Kumar S
First published: February 24, 2020, 11:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading