హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Concessions: విద్యార్థులు, నిరుద్యోగులకు రైలులో ఉచిత ప్రయాణం, టికెట్లలో రాయితీ... ఎవరికి ఎంతంటే

Railway Concessions: విద్యార్థులు, నిరుద్యోగులకు రైలులో ఉచిత ప్రయాణం, టికెట్లలో రాయితీ... ఎవరికి ఎంతంటే

Railway Concessions: విద్యార్థులు, నిరుద్యోగులకు రైలులో ఉచిత ప్రయాణం, టికెట్లలో రాయితీ... ఎవరికి ఎంతంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Concessions: విద్యార్థులు, నిరుద్యోగులకు రైలులో ఉచిత ప్రయాణం, టికెట్లలో రాయితీ... ఎవరికి ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)

Railway Ticket Concession for Students | మీరు విద్యార్థులా? అయితే భారతీయ రైల్వే రైలు టికెట్లపై 100 శాతం వరకు రాయితీ ఇస్తుంది. అంటే ఉచితంగా కూడా ప్రయాణించొచ్చు. రైల్వే టికెట్ కన్సెషన్ రూల్స్ తెలుసుకోండి.

  భారతీయ రైల్వే వేర్వేరు వర్గాలకు రైలు టికెట్లలో రాయితీ అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో విద్యార్థులకు 75 శాతం వరకు రాయితీ అందిస్తోంది. ఈ రాయితీతో పాటు కొందరు విద్యార్థులకు ఉచిత ప్రయాణాన్ని ఆఫర్ చేస్తోంది. ఈ రాయితీ విద్యార్థులు చదివే తరగతి, ప్రయాణిస్తున్న ఊరును బట్టి మారుతుంది. ఈ వివరాలను భారతీయ రైల్వే వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. మరి ఎవరికి ఎంత రాయితీ వస్తుందో తెలుసుకోండి.

  సొంతూళ్లకు, ఎడ్యుకేషనల్ టూర్లకు వెళ్లే విద్యార్థులు 75 శాతం వరకు రాయితీ పొందొచ్చు. జనరల్ కేటగిరీ విద్యార్థులు సెకండ్, స్లీపర్ క్లాస్ టికెట్లు, మంత్లీ సీజన్ టికెట్, క్వార్టర్లీ సీజన్ టికెట్లపై 50 శాతం కన్సెషన్ పొందొచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 75 శాతం వరకు రాయితీ పొందొచ్చు.

  తమ ఊరి నుంచి విద్యా సంస్థ ఉన్న ఊరికి వెళ్లేందుకు బాలికలకు ఉచితంగా మంత్లీ సీజన్ టికెట్ ఇస్తోంది రైల్వే. డిగ్రీ పూర్తి చేసే వరకు ఇది వర్తిస్తుంది. ఇక బాలురు 12వ తరగతి పూర్తి చేసేవరకు ఉచితంగా మంత్లీ సీజన్ టికెట్ పొందొచ్చు.

  Indian Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 358 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

  Railway Jobs: రైల్వే ఉద్యోగం మీ కలా? ఈ వార్నింగ్ మీకే

  గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఏడాదికి ఓసారి స్టడీ టూర్ కోసం వెళ్తే సెకండ్ క్లాస్ టికెట్‌పై 75 శాతం రాయితీ ఇస్తుంది రైల్వే.

  జాతీయ స్థాయి మెడికల్, ఇంజనీరింగ్ లాంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసేందుకు వెళ్లే గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు సెకండ్ క్లాస్ టికెట్‌పై 75 శాతం రాయితీ ఇస్తుంది రైల్వే.

  యూపీఎస్‌సీ, సెంట్రల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మెయిన్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లే విద్యార్థులకు సెకండ్ క్లాస్ టికెట్‌పై 50 శాతం రాయితీ ఇస్తుంది రైల్వే.

  భారతదేశంలో చదువుతున్న విదేశీ విద్యార్థులు భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపులు, సెమినార్లలో పాల్గొనేందుకు వెళ్లినా, చారిత్రక ప్రదేశాలకు వెళ్లినా వారికి సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై 50 శాతం రాయితీ లభిస్తుంది.

  పరిశోధనలు చేసే విద్యార్థులకు రీసెర్చ్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్తే సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై 50 శాతం రాయితీ లభిస్తుంది. 35 ఏళ్ల వయస్సులోపు వారికే వర్తిస్తుంది.

  Govt Jobs 2021: టెన్త్, ఇంటర్ అర్హతతో డిఫెన్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  MIDHANI Recruitment 2021: నెల్లూరులోని మిధాని యూనిట్‌లో ఉద్యోగాలు... రూ.72,000 వరకు వేతనం

  వర్క్ క్యాంప్స్‌లో పాల్గొనేందుకు వెళ్లే విద్యార్థులకు, నాన్ స్టూడెంట్స్‌కు సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై 25 శాతం రాయితీ లభిస్తుంది.

  మర్కెంటైల్ మెరైన్ కోసం నేవిగేషనల్, ఇంజనీరింగ్ ట్రైనింగ్ పొందుతున్న క్యాడెట్స్, మెరైన్ ఇంజనీర్ అప్రెంటీస్ ఇంటి నుంచి ట్రైనింగ్ జరిగే ప్రాంతానికి వెళ్తే సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై 50 శాతం రాయితీ లభిస్తుంది.

  నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్స్‌లో పాల్గొనే యువతీయువకులకు కూడా రైలు టికెట్లపై రాయితీ ఇస్తోంది భారతీయ రైల్వే. నేషనల్ యూత్ ప్రాజెక్ట్ క్యాంపులో పాల్గొనేందుకు వెళ్తే సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై 50 శాతం రాయితీ లభిస్తుంది. మానవ్ ఉత్థాన్ సేవా సమితి క్యాంపులో పాల్గొనేందుకు వెళ్తే సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై 40 శాతం రాయితీ లభిస్తుంది.

  SSC CGL Notification 2021: డిగ్రీ పాసైనవారికి 6506 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... అప్లై చేయండిలా

  AAI Recruitment 2021: రూ.1,00,000 పైగా జీతంతో ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 368 జాబ్స్

  ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ లాంటి సంస్థలు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీయువకులకు సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై 50 శాతం రాయితీ లభిస్తుంది.

  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరయ్యే విద్యార్థులకు సెకండ్ క్లాస్ టికెట్‌పై 100 శాతం, స్లీపర్ క్లాస్ టికెట్‌పై 50 శాతం రాయితీ లభిస్తుంది.

  భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కౌటింగ్ డ్యూటీపై వెళ్తే సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై 50 శాతం రాయితీ లభిస్తుంది.

  విద్యార్థులు రైల్వే రిజర్వేషన్ ఆఫీసులో, రిజర్వేషన్ కౌంటర్లలో రైలు టికెట్లపై రాయితీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Exams, Govt Jobs 2021, Indian Railway, Indian Railways, Irctc, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways, Train, Train tickets

  ఉత్తమ కథలు