హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Indian Railways Jobs: ఖాళీలు 1.4 లక్షలు... అభ్యర్థులు 2.4 కోట్లు... ఒక్కో పోస్టుకీ 171 మంది పోటీ

Indian Railways Jobs: ఖాళీలు 1.4 లక్షలు... అభ్యర్థులు 2.4 కోట్లు... ఒక్కో పోస్టుకీ 171 మంది పోటీ

ఖాళీలు 1.4 లక్షలు... అభ్యర్థులు 2.4 కోట్లు... పోస్టుకి 171 మంది పోటీ

ఖాళీలు 1.4 లక్షలు... అభ్యర్థులు 2.4 కోట్లు... పోస్టుకి 171 మంది పోటీ

Indian Railways Jobs: మీరు ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లైతే... మీరు చాలా గొప్పవారి కింద లెక్క. ఓ పెద్ద సవాలును మీరు ఎదుర్కోబోతున్నారు.

  Indian Railways Jobs: భారత్ లో ఎక్కువ మంది చేయాలనుకునే ఉద్యోగాల్లో రైల్వే ఉద్యోగాలు ఎప్పుటూ టాప్ 5లో ఉంటాయి. ఓవైపు భర్తీ జరుగుతుంటే, మరోవైపు ఖాళీలు ఏర్పడుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్ వర్క్ కావడం వల్ల రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (RRB)కు విపరీతమైన పని ఉంటుంది. అదే సమయంలో... ఈ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువే. ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ లో వేర్వేరు కేటగిరీలలో 1.4లక్షల ఖాళీలు ఉన్నాయి. ఆ పోస్టులు పొందేందుకు మాత్రం 2.4 కోట్ల మంది అభ్యర్థులు క్యూలో ఉన్నారు. అంటే అభ్యర్థులను ఎంపిక చేయడం RRBకి, పోస్టులను సాధించడం అభ్యర్థులకూ ఇద్దరికీ ఇదో సవాలే.

  రైల్వే శాఖ తాజాగా ఓ స్టేట్ మెంట్ జారీ చేసింది. "మూడు రకాల కేంద్ర ఉద్యోగాలలో భాగంగా... NTPC కేటగిరీలు, మంత్రిత్వ శాఖల కేటగిరీలు, లెవెల్-1 కేటగిరీల్లో ఖాళీల భర్తీ కోసం RRB మూడు రకాల నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ మొత్తం ఉద్యోగాలకు 1.4 లక్షల ఖాళీలున్నాయి" అని స్టేట్ మెంట్ లో తెలిపింది.

  "ఈ ఉద్యోగాల కోసం 2.4 కోట్ల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వీళ్లందరికీ డిసెంబర్ 15 నుంచి కంప్యూటర్ ఆధారిత టెస్టులు (CBTs)... సజావుగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం" అని రైల్వే శాఖ తన స్టేట్ మెంట్ లో తెలిపింది. ఏ టెస్టులు ఎప్పుడు జరిపేదీ... షెడ్యూల్ ను RRB తన వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు చెప్పనుంది.

  ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో మూడు రకాల ఖాళీలున్నాయి. అవి NTPC (టెక్నికల్ కాని పాపులర్ కేటగిరీలు అంటే గార్డులు, ఆఫీస్ క్లర్కులు, కమర్షియల్ క్లర్కులు మొదలైనవి)లో 35,208 ఖాళీలున్నాయి. ఇక స్టెనో, టీచెస్ వంటివి మంత్రిత్వ శాఖ కేటగిరీల్లో భాగంగా... 1,663 ఉన్నాయి. అలాగే ట్రాక్ మెయింటేనర్స్, పాయింట్స్ మాన్ వంటివి లెవెల్-1 ఖాళీలుగా 1,03,769 ఉన్నాయి.

  ఒక్కో ఉద్యోగానికీ సగటున 171 మంది పోటీ పడుతున్నారు. ఇలాంటి పోటీని తట్టుకొని పోస్ట్ కొట్టడం అభ్యర్థికి అతి పెద్ద సవాలు... అలాగే... అభ్యర్థిని ఎంపిక చేయడం కూడా RRBకి సవాలే. అభ్యర్థుల జాబితాలో మీరు ఉన్నట్లైతే... భారీ పోటీని దృష్టిలో పెట్టుకొని... అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Indian Railways, RRB

  ఉత్తమ కథలు