Railway Jobs: రైల్వే సంస్థలో 182 జాబ్స్... మార్చి 26 చివరి తేదీ

Railway Jobs: రైల్వే సంస్థలో 182 జాబ్స్... మార్చి 26 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)

DMW Recruitment 2020 | భారతీయ రైల్వేతో పాటు రైల్వే అనుబంధ సంస్థలు ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాయి. డీజిల్ లోకో మోడర్నైజేషన్ వర్క్స్-DMW 182 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

  • Share this:
    భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన డీజిల్ లోకో మోడర్నైజేషన్ వర్క్స్-DMW ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 182 ఖాళీలను ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు https://dmw.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు. అభ్యర్థులు ముందుగా https://www.apprenticeship.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 26 చివరి తేదీ. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే.

    DMW Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 182
    ఎలక్ట్రీషియన్- 70
    మెకానిక్ (డీజిల్)- 40
    మెషినిస్ట్- 32
    ఫిట్టర్- 23
    వెల్డర్ (జీ అండ్ ఈ)- 17

    DMW Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 27
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 26
    విద్యార్హత- 12వ తరగతితో పాటు ఐటీఐ పాస్ కావాలి.
    వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Jobs: పీజీ పాసైనవారికి 150 జేఆర్ఎఫ్ పోస్టులు... వివరాలివే

    Education Loan: ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారా? ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి

    Govt Jobs: కరోనా ఎఫెక్ట్... 147 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త షెడ్యూల్
    Published by:Santhosh Kumar S
    First published: