Indian Railway Jobs: పది పాసైన అభ్యర్థులకు రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..

ప్రతీకాత్మక చిత్రం

Indian Railway Jobs: భారతీయ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈస్ట్ సెంట్రల్​ రైల్వే(ఈసీఆర్​) పరిధిలోని వివిధ విభాగాల్లో 2206 ట్రేడ్​ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.rrcecr.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

  • Share this:
భారతీయ రైల్వే (Indian Railway) నిరుద్యోగులకు(Unemployee) శుభవార్త(Good news) చెప్పింది. ఈస్ట్ సెంట్రల్​ రైల్వే(East Central Railway​) పరిధిలోని వివిధ విభాగాల్లో 2206 ట్రేడ్​ అప్రెంటీస్(Trade apprentices) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (Notification)విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.rrcecr.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. నవంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, ఈ అప్రెంటీస్​ ఖాళీల భర్తీకి ఎటువంటి పరీక్ష నిర్వహిచడం లేదు. కేవలం పదోతరగతి, సంబంధిత ఐటీఐ విభాగంలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AICTE Saksham Scholarship: ఆ విద్యార్థులకు ఏఐసీటీఈ సాక్షం స్కాలర్‌షిప్.. ఎంపికైతే ఏటా రూ.50 వేలు స్టైఫండ్..


విద్యార్హత(Qualifications):
దరఖాస్తుదారులు 10+2 విధానంలో 10 వ తరగతి/మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా కనీసం 50% మొత్తం మార్కులతో గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

South Central Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి మరికొన్ని రైళ్లు అందుబాటులోకి..


వయోపరిమితి (Age limit):
దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థుల కనీస వయస్సు 2021 జనవరి 1 నాటికి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు 13 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. అభ్యర్థులు ఆర్​ఆర్​సీ (ఈసీఆర్​) అధికారిక వెబ్‌సైట్ www.rrcecr.gov.in ని సందర్శించాలి.

2. హోమ్​ పేజీలోని అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ లింక్​పై క్లిక్​ చేయండి.

3. అప్లికేషన్​ ఫారమ్​లో అవసరమైన అన్ని వివరాలను పూరించి రిజిస్ట్రేషన్​ పూర్తి చేసుకోండి.

Sad Incident: అతడి చిరునవ్వు ఆ రోజుతో చివరిది అని ఊహించలేకపోయాడు.. సైగలతో పలకరించినా చివరకు..


4. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు రూ .100 చెల్లించండి.

5. భవిష్యత్తు అవసరాల కోసం మీ ECR అప్రెంటీస్ దరఖాస్తు ఫారమ్‌ను ప్రింటవుట్​ తీసుకోండి.

Shocking Video: నా కూతురుతో తిరుగుతావా.. ప్యాంట్‌కు ఉన్న బెల్టు తీసి అతడు ఏం చేశాడో చూడండి..


సెలెక్షన్​ ప్రాసెస్(Selection Process): ​
ఈస్ట్​ సెంట్రల్​ రైల్వేలో ట్రేడ్​ అప్రెంటీస్​ పోస్టుల నియామకం కోసం ఎటువంటి పరీక్ష ఉండదు. కేవలం మెట్రిక్యులేషన్​, ఐటిఐ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ప్రకారం మెరిట్​ లిస్ట్​ తయారు చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్​కు పిలుస్తారు. నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలాంటే ఇక్కడ క్లిక్ ఇవ్వండి.
Published by:Veera Babu
First published: