news18-telugu
Updated: August 10, 2020, 10:15 AM IST
Railway Jobs: మొత్తం 5285 ఉద్యోగాలతో జాబ్ నోటిఫికేషన్... క్లారిటీ ఇచ్చిన రైల్వే
(ప్రతీకాత్మక చిత్రం)
భారతీయ రైల్వేలో ఉద్యోగం పొందడం నిరుద్యోగుల కల. రైల్వే నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చిందంటే లక్షలాది మంది దరఖాస్తు చేస్తుంటారు. పోటీ పరీక్షలు రాస్తుంటారు. నిరుద్యోగుల ఆశల్ని క్యాష్ మోసగాళ్లు ఎప్పుడూ క్యాష్ చేసుకుంటూనే ఉంటారు. రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తుంటారు. అలాంటి మోసమే ఇది కూడా. రైల్వేలో 8 కేటగిరీల్లో 5285 ఉద్యోగాలతో భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసిందంటూ ఓ సర్క్యులర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'అవెస్ట్రాన్ ఇన్ఫోటెక్' పేరుతో www.avestran.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాలని కోరుతూ ప్రముఖ వార్తా పత్రికలో వచ్చిన ప్రకటనను భారతీయ రైల్వే ఖండించింది. ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఇచ్చిన ప్రకటనపై భారతీయ రైల్వే వివరణ ఇచ్చింది.
Jobs: ఎయిమ్స్‌లో 3803 ఉద్యోగాలు... ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఖాళీలుIBPS RRB 2020: మొత్తం 9640 బ్యాంకు ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ఐబీపీఎస్... సిలబస్ ఇదే
భారతీయ రైల్వేలో ఉద్యోగాలకు రైల్వేనే ప్రకటనలు ఇస్తుందని, ప్రైవేట్ ఏజెన్సీలు కాదని వివరించింది. రైల్వే పేరుతో ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడానికి ఏ ప్రైవేట్ ఏజెన్సీకి అధికారం లేదని స్పష్టం చేసింది. ఆ ప్రకటన మోసపూరితమని వివరించింది. సదరు ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే ప్రకటించింది. అంతేకాదు... ప్రస్తుతం వేర్వేరు కేటగిరీల్లో గ్రూప్ సీ, గ్రూప్ డీ పోస్టుల్ని భారతీయ రైల్వేకు చెందిన 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు, 16 రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్ భర్తీ చేస్తున్నాయని ఇండియన్ రైల్వేస్ క్లారిటీ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీని ఏ ఏజెన్సీకి అప్పగించలేదని స్పష్టం చేసింది. రైల్వేలో పోస్టులన్నీ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తుంది రైల్వే.
SBI Jobs: డిగ్రీ పాసైనవారికి ఎస్బీఐలో 3850 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
UPSC Jobs: ఇంటర్, డిగ్రీ అర్హతతో 344 ఉద్యోగాలు... హైదరాబాద్‌లోనూ ఖాళీలు
రైల్వేలో 5285 ఉద్యోగాలు ఉన్నాయంటూ 'అవెస్ట్రాన్ ఇన్ఫోటెక్' పేరుతో 2020 ఆగస్ట్ 8న వచ్చిన ప్రకటన ఇది. 8 కేటగిరీల్లో 11 ఏళ్లపాటు కాంట్రాక్టు పోస్టులని, వీటికి దరఖాస్తు చేయాలని ఆ ప్రకటనలో వివరించారు. అంతేకాదు... 2020 సెప్టెంబర్ 10 లోగా రూ.750 డిపాజిట్ చేయాలని కోరారు. మీరు కూడా ఈ ప్రకటన చూసినట్టైతే దరఖాస్తు చేయకూడదు. ఇది ఫేక్ జాబ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసేందుకు మీరు డబ్బులు చెల్లించినట్టైతే మోసపోయినట్టే. రైల్వేకు సంబంధించిన ఉద్యోగాల కోసం భారతీయ రైల్వేలోని వేర్వేరు జోన్లకు చెందిన అధికారిక వెబ్సైట్లతో పాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు-RRB వెబ్సైట్లను మాత్రమే ఫాలో కావాలి. ఈ వెబ్సైట్లలో మాత్రమే దరఖాస్తు చేయాలి. దళారుల్ని, బ్రోకర్లను నమ్మి మోసపోకూడదు.
Published by:
Santhosh Kumar S
First published:
August 10, 2020, 9:55 AM IST