హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs: 8 నోటిఫికేషన్లు... 3488 ఉద్యోగాలు... లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?

Jobs: 8 నోటిఫికేషన్లు... 3488 ఉద్యోగాలు... లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?

Jobs: 8 నోటిఫికేషన్లు... 3488 ఉద్యోగాలు... లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)

Jobs: 8 నోటిఫికేషన్లు... 3488 ఉద్యోగాలు... లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

Jobs 2020 | తగిన అర్హతలు ఉన్నా ఇంకా మంచి ఉద్యోగం రాలేదా? ప్రస్తుతం కొన్ని జాబ్ నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మీ అర్హతలకు తగ్గ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

  నిరుద్యోగులకు శుభవార్త. తగిన అర్హతలు ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఈపీఎఫ్ఓ, భారతీయ రైల్వే, ఇండియన్‌ కోస్ట్ గార్డ్‌తో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉన్నాయి. టెక్నికల్ పోస్టులతో పాటు నాన్ టెక్నికల్ పోస్టులున్నాయి. బ్యాంక్ జాబ్స్ ఉన్నాయి. వాటిలో 8 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ దగ్గరకొచ్చేస్తోంది. మరి ఆ నోటిఫికేషన్లు ఏవో, భర్తీ చేస్తున్న పోస్టులు ఏవో తెలుసుకోండి.

  1. ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్-జనరల్ డ్యూటీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 260 ఖాళీలను భర్తీ చేయనుంది. యువకులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 2 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  2. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO సంస్థలో భారీగా ఖాళీల భర్తీ జరుగుతోంది. ఈపీఎఫ్ఓలో ఖాళీలను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నోటిఫికేషన్ జారీ చేసింది. ఈపీఎఫ్‌ఓలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది యూపీఎస్‌సీ. మొత్తం 421 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  3. సౌత్ ఈస్టర్న్ రైల్వే మొత్తం 1785 ఖాళీలను ప్రకటించింది. మెరిట్ ద్వారా అప్రెంటీస్ అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఆగ్నేయ రైల్వే. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  4. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-BHEL మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 550 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ లాంటి పోస్టులున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  5. భారత అణుశక్తి విభాగానికి చెందిన హెవీ వాటర్ బోర్డు-HWB ఖాళీలను భర్తీ చేస్తోంది. స్టైపెండరీ ట్రైనీ, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. మొత్తం 185 ఖాళీలున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  6. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. నాన్ ఎగ్జిక్యూటీవ్ సిబ్బందిని నియమించుకుంటోంది. పలు విభాగాల్లో మొత్తం 37 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రొఫీషియెన్సీ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


  7. భారతీయ రైల్వేకు చెందిన సంస్థ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్-RITES పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 100 పోస్టుల్ని ప్రకటించింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  8. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్-NABARD మొత్తం 150 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. మొత్తం 150 పోస్టుల్ని ప్రకటించింది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 3 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  ఈ నోటిఫికేషన్లలో వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముంద నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.

  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇవి కూడా చదవండి:

  UPSC Jobs: మొత్తం 134 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్

  Railway Jobs: రైల్వేలో మరో 2792 ఖాళీలకు నోటిఫికేషన్... వివరాలివే

  IIT Hyderabad Jobs: ఐఐటీ హైదరాబాద్‌లో 152 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: BHEL, CAREER, EPFO, Exams, Indian Coast Guard, Indian Oil Corporation, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railways, UPSC

  ఉత్తమ కథలు