news18-telugu
Updated: August 7, 2020, 2:57 PM IST
Railway Jobs: నిరుద్యోగులకు రైల్వే షాక్... ఇక ఆ ఉద్యోగాలు ఉండవు
(ప్రతీకాత్మక చిత్రం)
భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి షాక్. వలస కాలం సంప్రదాయానికి భారతీయ రైల్వే తెర వేస్తోంది. రైల్వే సీనియర్ ఉద్యోగుల ఇళ్లల్లో పనిచేసే కళాసీ లేదా బంగ్లా ప్యూన్ ఉద్యోగాల నియామకాలను రైల్వే నిలిపివేయనుంది. ఇకపై కొత్తగా ఈ పోస్టుల్ని నియమించాల్సిన అవసరం లేదని రైల్వే బోర్డు ఆదేశించింది. టెలిఫోన్ అటెండెంట్ కమ్ డాక్ కళాసీ పోస్టుల భర్తీపై రైల్వే బోర్డు సమీక్ష జరిపింది. ఇకపై టెలిఫోన్ అటెండెంట్ కమ్ డాక్ కళాసీ పోస్టుల్ని భర్తీ చేయకూడదని నిర్ణయించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని రైల్వే బోర్డు ప్రకటించింది. 2020 జూలై 1 నుంచి నియమించిన ఈ పోస్టుల్ని రైల్వే బోర్డు సమీక్షించనుంది. భారతీయ రైల్వేకు చెందిన అన్ని కార్యాలయాలకు, సంస్థలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని రైల్వే బోర్డు తెలిపింది. రైల్వేలో తాత్కాలికంగా టెలిఫోన్ అటెండెంట్ కమ్ డాక్ కళాసీ పోస్టుల్లో 8వ తరగతి పాసైన వారిని ఈ పోస్టుల్లో నియమించేవారు. వేతనం రూ.20,000 లభించేది. గ్రూప్ డీ సిబ్బందికి వచ్చే బెనిఫిట్స్ లభించేవి.
SBI Jobs: డిగ్రీ పాసైనవారికి ఎస్బీఐలో 3850 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలాUPSC Jobs: ఇంటర్, డిగ్రీ అర్హతతో 344 ఉద్యోగాలు... హైదరాబాద్‌లోనూ ఖాళీలు
రైల్వే కళాసీ పోస్టుల్లో ఉన్నవారు మూడేళ్ల తర్వాత స్క్రీనింగ్ ప్రాసెస్ పూర్తి కాగానే గ్రూప్ డీ సిబ్బందిగా మారుతున్నారు. గతంలో మారుమూల ప్రాంతాల్లో పనిచేసే అధికారులు ఆఫీసు పనులపై బయటకు వెళ్తే వారి కుటుంబ సభ్యులకు టెలిఫోన్ అటెండెంట్ కమ్ డాక్ కళాసీలు కాపలాగా ఉండేవారు. ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునేవారు. ఆ తర్వాత ఈ సిబ్బంది టికెట్ ఎగ్జామినర్, పోర్టర్, ఏసీ కోచ్ మెకానిక్స్, కుక్స్ పోస్టుల్లోకి మారేవారు. అయితే రైల్వే అధికారులు వారిని ఇంటిపనికి కూడా ఉపయోగించుకునేవారు. దీనిపై రైల్వేకు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఈ పోస్టులను రివ్యూ చేయాలంటూ 2014 లో జాయింట్ సెక్రెటరీ స్థాయిలో 9 మంది సభ్యులతో రైల్వే బోర్డు ఓ కమిటీని వేసింది.
Published by:
Santhosh Kumar S
First published:
August 7, 2020, 2:54 PM IST