Jobs: 10 నోటిఫికేషన్లు... 16,545 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే

Apprentice Jobs 2020 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

news18-telugu
Updated: January 21, 2020, 7:08 PM IST
Jobs: 10 నోటిఫికేషన్లు... 16,545 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే
Jobs: 10 నోటిఫికేషన్లు... 16,545 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ రైల్వే, బీహెచ్ఈఎల్, రైల్వే అనుబంధ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. వాటిలో ఎక్కువగా అప్రెంటీస్ పోస్టులు ఉంటున్నాయి. ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ లాంటి ట్రేడ్స్‌లో ఐటీఐ పాసైనవారికి వేల సంఖ్యలో ఉద్యోగాలున్నాయి. ప్రస్తుతం 10 నోటిఫికేషన్లలో 16,545 అప్రెంటీస్ పోస్టులు భర్తీ అవుతున్నాయి. వీటిలో ఎక్కువగా భారతీయ రైల్వేలోని వివిధ జోన్లల్లో పోస్టులన్నాయి. మరి ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.

1. రక్షణ శాఖకు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భారీగా అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో మొత్తం 6060 ఖాళీలను ప్రకటించింది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్-OFB. అందులో 3808 ఐటీఐ పోస్టులు, 2252 నాన్ ఐటీఐ పోస్టులు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 పోస్టులున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2. వెస్టర్న్ రైల్వే 3,553 ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3. సెంట్రల్ రైల్వే 2562 పోస్టుల భర్తీ చేపట్టింది. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్ లాంటి పోస్టులున్నాయి. ముంబై, పుణె, నాగ్‌పూర్, సోలాపూర్, భూసావల్ పరిధిలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తుకు 2020 జనవరి 22 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



4. సౌత్ ఈస్టర్న్ రైల్వే 1785 ఖాళీల భర్తీ చేస్తోంది. మెరిట్ ద్వారా అప్రెంటీస్ అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఆగ్నేయ రైల్వే. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 3 చివరి తేదీ. మరన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5. పశ్చిమ మధ్య రైల్వే అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 1273 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 14 చివరి తేదీ. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-BHEL మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 550 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.7. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ 400 పోస్టుల్ని ప్రకటించింది. కపుర్తలాలో గల యూనిట్‌లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

8. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL దేశవ్యాప్తంగా ఖాళీలను భర్తీ చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చెరిలో 248 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెషినిస్ట్ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులున్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

9. భారతీయ రైల్వేకు చెందిన సంస్థ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్-RITES పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 100 పోస్టుల్ని ప్రకటించింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

10. పశ్చిమ రైల్వే 14 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. మరిన్ని వివరాలు https://www.rrc-wr.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో భర్తీ చేస్తున్న ఖాళీలివి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Bank Jobs: బ్యాంకు ఉద్యోగం కావాలా? ఈ నోటిఫికేషన్లకు అప్లై చేయండి

RBI Jobs: గుడ్ న్యూస్... 926 అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగించిన ఆర్‌బీఐ

EPFO Jobs: యూపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్ఓలో 421 పోస్టులు
First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు