Home /News /jobs /

INDIAN RAILWAY START A SHOP LIKE THIS AT THE RAILWAY STATION KNOW INCOME PLAN FULL DETAILS HERE VB

Indian Railway: రైల్వే స్టేషన్‌లో స్టాల్స్, దుకాణాల ఏర్పాటు.. రూ. లక్షల్లో సంపాదన..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Indian Railway: రైలులో ప్రయాణిస్తున్న సమయంలో మనం రైల్వే స్టేషన్లలో అనేక రకాల చిన్న దుకాణాలు, స్టాళ్లను చూస్తూ ఉంటాము. ఈ దుకాణాల ద్వారా రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. ఇటువంటి వ్యాపారం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

  • News18 Telugu
  • Last Updated :
  • Secunderabad, India
రవాణా(Transport) పరంగా ప్రయాణికులకు రైల్వే(Indian Railway) చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు రైల్వే శాఖ ద్వారా సామాన్యులకు కూడా ఉపాధి లభించనుంది.  దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో(Railway Stations) మీరు ఒక చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు. ఈ షాపుతో లక్షల రూపాయలు సంపాదించవచ్చు. భారతీయ రైల్వే యొక్క IRCTC వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన మొత్తం సమాచారం అందుబాటులో ఉంది. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో మనం రైల్వే స్టేషన్లలో(Railway Station) అనేక రకాల చిన్న దుకాణాలు, స్టాళ్లను చూస్తూ ఉంటాము. ఈ దుకాణాల ద్వారా రకరకాల వ్యాపారాలు (Business) చేస్తుంటారు. అటువంటి వ్యాపారాన్ని ప్రారంభించే ప్రక్రియ చాలా సులభం. దుకాణం కొనుగోలు చేయాల్సిన స్టేషన్‌లో దుకాణం అందుబాటులో ఉందా లేదా అనేది టెండర్(Tender) ప్రక్రియ ద్వారా తెలుస్తుంది.

Scholarship: ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కు రూ.75 వేల స్కాలర్‌షిప్.. దరఖాస్తు చేయండిలా..

దుకాణం స్థలం, ప్రదేశం ఆధారంగా రైల్వే శాఖ ఛార్జీలు వసూలు చేస్తుంది. ఆ తర్వాత మీరు చేయాలనుకుంటున్న వ్యాపారాన్ని బట్టి ఖర్చు చేయాలి. రైల్వే స్టేషన్లలో మీరు బుక్ స్టాల్స్, టీ-కాఫీ స్టాల్స్, న్యూస్ పేపర్ స్టాల్స్ మొదలైనవాటిని నడపవచ్చు. రూ.40 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. అదేవిధంగా అనేక చిన్న స్టాల్స్‌ను కూడా నడపవచ్చు. ఈ ఖర్చు అనేది తీసుకున్న స్థలాన్ని బట్టి ఉంటుంది. సంపాదన మాత్రం పెట్టిన పెట్టుబడికి మూడింతలు వస్తుంది.



ఏ పత్రాలు అవసరం..
రైల్వే స్టేషన్‌లోని దుకాణంతో ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే.. మీరు ఒక ప్రక్రియ ద్వారా వెళ్ళాలి. ముందుగా షాప్ ప్రారంభించడానికి మీరు దేశ పౌరుడై ఉండాలి. అంతే కాకుండా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ కలిగి ఉండాలి.

రైల్వే స్టేషన్‌లో దుకాణం లేదా స్టాల్ ప్రారంభించడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. మీరు దుకాణాన్ని తెరవాలనుకుంటున్న స్టేషన్‌లో టెండర్ జారీ చేయబడిందా లేదా అని చూడటానికి మీరు IRCTC వెబ్‌సైట్‌కి వెళ్లాలి. టెండర్ జారీ చేసినట్లయితే.. ఫారమ్‌ను నింపి రైల్వే డివిజనల్ కార్యాలయం లేదా డిఆర్‌ఎం కార్యాలయంలో సమర్పించాలి. ఈ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో కూడా నింపవచ్చు. మీ దరఖాస్తును సమర్పించిన తర్వాత.. మీరు అందించిన సమాచారం రైల్వే శాఖ ద్వారా ధృవీకరించబడుతుంది. ఆ తర్వాత టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. దీని కోసం మీరు www.indianrailways.gov వద్ద భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఇది కూడా చదవండి : ఏ ఆధారం లేదు.. జామ్‌నగర్ జూకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే శాఖ తరపున ఈ పథకం ప్రారంభించబడింది. సంబంధిత జిల్లా లేదా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన , స్థానికంగా తయారు చేయబడిన ఉత్పత్తులను మాత్రమే అక్కడ విక్రయించవచ్చు. రైల్వే స్టేషన్లకు వెళ్లిన తర్వాత ఆ ప్రాంతానికి తెలిసిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అందువల్ల.. ఆ స్థానిక ఉత్పత్తులకు కూడా మార్కెట్ లో మంచి డిమాంట్ ఉంటుంది.

రైల్వే రవాణా దేశంలో కమ్యూనికేషన్‌లో ముఖ్యమైన భాగం. మీరు దేశంలోని ఏదైనా ప్రదేశానికి చేరుకోవాలనుకుంటే రైలు ఉత్తమమైన సాధనం. అయితే ఇప్పుడు ఈ శాఖ ద్వారా ఉపాధి కూడా అందుబాటులోకి రావడంతో రైల్వే శాఖ చేపట్టిన ఈ చర్యకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, India Railways, Indian, Indian Railways, JOBS, South Central Railways

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు