హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs 2022: ఇండియన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా జాబ్స్.. దరఖాస్తుకు మరో 5 రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

Railway Jobs 2022: ఇండియన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా జాబ్స్.. దరఖాస్తుకు మరో 5 రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా సౌత్ ఈస్టర్న్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా పలు గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయడానికి భారతీయ రైల్వే దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియన్ రైల్వేలో (Indian Railways) ఉద్యోగం చేయాలన్నది లక్షలాది మంది నిరుద్యోగుల కల. ఉద్యోగాల భర్తీకి రైల్వే సైతం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లను (Railway Jobs Notification) విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా సౌత్ ఈస్టర్న్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా పలు గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయడానికి భారతీయ రైల్వే దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తాజాగా ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ser.indianrailways.gov.inను సందర్శించాలని ప్రకటనలో సూచించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ స్పోర్ట్స్ కోటా కింద జరగనుంది.

ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2022 ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్ 15

దరఖాస్తుకు ఆఖరి తేదీ: నవంబర్ 14

ఖాళీల వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య- 21

గ్రూప్ C స్థాయి 4/లెవల్ 5: 5 పోస్ట్‌లు

గ్రూప్ C స్థాయి 2/లెవల్ 3: 16 పోస్ట్‌లు

IB Recruitment 2022: ఇంటెలిజెన్స్ బ్యూరోలో టెన్త్ అర్హతతో 1671 జాబ్స్ .. ప్రారంభమైన దరఖాస్తులు.. మరికొన్ని రోజులే ఛాన్స్

ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2022 కోసం అర్హత ప్రమాణాలు:

లెవల్ 5: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.

లెవల్ 3: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు పరిమితి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

రిక్రూట్మెంట్ ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ కమిటీ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. సర్టిఫికేట్ (క్రీడలు మరియు విద్యాపరమైన) ధృవీకరణ తర్వాత స్పోర్ట్స్ ట్రయల్స్‌లో పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

First published:

Tags: JOBS, Railway jobs

ఉత్తమ కథలు