భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. రైల్వే జోన్లతో పాటు రైల్వే అనుబంధ సంస్థలు కూడా ఖాళీలను భర్తీ చేస్తున్నాయి. వేల సంఖ్యలో పోస్టుల్ని ప్రకటిస్తున్నాయి. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వేర్వేరుగా వస్తున్నాయి. ప్రస్తుతం 8 నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 8,612 పోస్టులున్నాయి. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఏ ఉద్యోగానికి అయినా దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
1. నోటిఫికేషన్ల వారీగా చూస్తే వెస్టర్న్ రైల్వే 3,553 ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2. సెంట్రల్ రైల్వే 2562 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 22 చివరి తేదీ. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3. సౌత్ ఈస్టర్న్ రైల్వే 1785 ఖాళీలను ప్రకటించింది. మెరిట్ ద్వారా అప్రెంటీస్ అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఆగ్నేయ రైల్వే. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4. భారతీయ రైల్వేకు చెందిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ 400 పోస్టుల్ని ప్రకటించింది. కపుర్తలాలో గల యూనిట్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5. క్లర్క్ పోస్టుల భర్తీకి సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 251 పోస్టులున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 19 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6. స్పోర్ట్స్ కోటాలో పలు పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఆగ్నేయ మధ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్ లాంటి క్రీడల్లో ప్రతిభ చూపించినవారి నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. మొత్తం 26 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 13 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
7. నార్త్ సెంట్రల్ రైల్వేలో గ్రూప్ సీ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. మొత్తం 21 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 20 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
8. రైల్వేలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో కూడా ఖాళీల భర్తీ కొనసాగుతోంది. పశ్చిమ రైల్వే 14 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేస్తోంది... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Axis Bank Jobs: యాక్సిస్ బ్యాంక్‌లో ఉద్యోగాల జాతర... 4,000 పోస్టుల భర్తీ
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ జాబ్స్... ఖాళీల వివరాలివే
Bank Jobs: బ్యాంకు ఉద్యోగం మీ కలా? అప్లై చేయాల్సిన నోటిఫికేషన్లు ఇవే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railway employees, Railways