IRCTC: ఐఆర్‌సీటీసీలో ఉద్యోగాలు... హైదరాబాద్, విశాఖ, విజయవాడలో ఇంటర్వ్యూలు

IRCTC Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు 2019 ఆగస్ట్ 14, 16, 19, 21, 24 తేదీల్లో దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

news18-telugu
Updated: August 11, 2019, 9:44 AM IST
IRCTC: ఐఆర్‌సీటీసీలో ఉద్యోగాలు... హైదరాబాద్, విశాఖ, విజయవాడలో ఇంటర్వ్యూలు
IRCTC: ఐఆర్‌సీటీసీలో ఉద్యోగాలు... హైదరాబాద్, విశాఖ, విజయవాడలో ఇంటర్వ్యూలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 11, 2019, 9:44 AM IST
నిరుద్యోగులకు శుభవార్త. భారత రైల్వే అనుబంధ సంస్థ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌- IRCTC సూపర్‌వైజర్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఆన్‌లైన్ టికెటింగ్‌తో పాటు కేటరింగ్, టూరిజం లాంటి సేవల్ని అందించే ఐఆర్‌సీటీసీలో సూపర్‌వైజర్ ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి. రెండేళ్ల కాంట్రాక్ట్ పద్ధతిలో హాస్పిటాలిటీ విభాగంలో మొత్తం 85 సూపర్‌వైజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐఆర్‌సీటీసీ. ఆసక్తిగల అభ్యర్థులు 2019 ఆగస్ట్ 14, 16, 19, 21, 24 తేదీల్లో దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లో కూడా ఇంటర్వ్యూలు ఉన్నాయి. సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఐఆర్‌సీటీసీ జారీ చేసిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IRCTC Recruitment 2019: ఐఆర్‌సీటీసీ నోటిఫికేషన్ వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 85

అర్హత: హాస్పిటాలిటీ, హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫుల్ టైమ్ బీఎస్సీ పాస్ కావాలి.
వయస్సు: 30 ఏళ్లు
వేతనం- రూ.25,000


ఇంటర్వ్యూ జరిగే తేదీ, స్థలం వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.
Loading...
irctc recruitment 2019, irctc jobs, irctc supervisor jobs, irctc jobs 2019, irctc vacancy 2019, irctc hospitality jobs, irctc hospitality supervisor, ఐఆర్‌సీటీసీ రిక్రూట్‌మెంట్ 2019, ఐఆర్‌సీటీసీ ఉద్యోగాలు, ఐఆర్‌సీటీసీ సూపర్‌వైజర్ ఉద్యోగాలు, ఐఆర్‌సీటీసీ ఉద్యోగాలు 2019, ఐఆర్‌సీటీసీ ఖాళీలు 2019, ఐఆర్‌సీటీసీ హాస్పిటాలిటీ ఉద్యోగాలు, ఐఆర్‌సీటీసీ హాస్పిటాలిటీ సూపర్‌వైజర్

దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేసి నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. దరఖాస్తు ఫామ్‌తో పాటు కావాల్సిన డాక్యుమెంట్ల జిరాక్స్‌ కాపీలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేయాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలుఇవి కూడా చదవండి:

Bank Jobs: డిగ్రీ పాసయ్యారా? 4,336 బ్యాంక్ జాబ్స్... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు... సిలబస్ ఇదే

LIC Jobs: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌లో 300 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: August 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...