హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB NTPC Group D Exam Dates: ఆర్ఆర్‌బీ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది... ఎవరికి ఎప్పుడంటే

RRB NTPC Group D Exam Dates: ఆర్ఆర్‌బీ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది... ఎవరికి ఎప్పుడంటే

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

RRB NTPC Group D Exam Dates | ఆర్ఆర్‌బీ నిర్వహించే పలు పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఎవరికి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో తెలుసుకోండి.

  రైల్వే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకొని పరీక్షల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఆర్ఆర్‌బీ నిర్వహించే పలు పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC, గ్రూప్ డీ, మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్లు గత ఏడాది రిలీజైనా ఇప్పటివరకు కంప్యూటర్ బేస్ట్ టెస్ట్-CBT 1 కూడా జరగలేదు. కోట్లాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వారంతా ఎగ్జామ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. పరీక్షలు అప్పుడు, ఇప్పుడు అన్న వార్తలు తప్ప అధికారిక సమాచారం ఇన్నాళ్లూ లేదు. అయితే కొన్ని నెలల క్రితం ఈ పరీక్షలపై క్లారిటీ ఇచ్చింది భారతీయ రైల్వే. 2020 డిసెంబర్ 15 నుంచి ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ప్రకటించింది. మొత్తానికి ఇప్పుడు తుది షెడ్యూల్‌ను విడుదల చేసింది. భారతీయ రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ఓ ప్రెస్ మీట్‌లో ఈ షెడ్యూల్‌ని ప్రకటించారు.

  ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్ కేటగిరీస్ అంటే స్టేనో, టీచర్ పోస్టులకు 2020 డిసెంబర్ 15 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 1,663 పోస్టులకు 1.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

  RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

  SSC Recruitment 2020: ఇంటర్ పాసైనవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... అప్లై చేయండిలా

  ఇక ఎన్‌టీపీసీ పోస్టులకు అంటే స్టేషన్ మాస్టర్, గార్డ్స్, ఆఫీస్ క్లర్క్స్, కమర్షియల్ క్లర్క్ పోస్టులకు 2020 డిసెంబర్ 28 నుంచి 2021 మార్చి చివరి వారం వరకు దశలవారీగా పరీక్షలు జరుగుతాయి. మొత్తం 35,208 పోస్టులకు 1 కోటీ 26 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో దశలవారీగా పరీక్షల్ని నిర్వహిస్తోంది ఆర్ఆర్‌బీ.

  ఇక లెవెల్ 1 పోస్టులకు అంటే ట్రాక్ మెయింటైనర్స్, పాయింట్స్ మ్యాన్ లాంటి లెవెల్ 1 ఉద్యోగాలకు 2021 ఏప్రిల్ నుంచి 2021 జూన్ మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరగనుంది. మొత్తం 1,03,769 పోస్టులకు 1.15 కోట్ల మంది అభ్యర్థులు అప్లై చేశారు.

  SBI PO recruitment 2020: డిగ్రీ పాసయ్యారా? ఎస్‌బీఐలో 2000 ఉద్యోగాలకు రెండు రోజుల్లో అప్లై చేయండి

  SBI Jobs 2020: తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌బీఐలో 1080 ఉద్యోగాలు... జిల్లాల వారీగా ఖాళీల వివరాలివే

  ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 1,40,640 పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆర్ఆర్‌బీ. ఈ పోస్టులకు 2.44 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఎగ్జామ్‌కు 10 రోజుల ముందు విడుదలౌతాయి. అభ్యర్థులు నివసించే ప్రాంతానికి దగ్గర్లోనే ఎగ్జామ్ సెంటర్లను అలాట్ చేయనుంది ఆర్ఆర్‌బీ. దీని వల్ల అభ్యర్థులు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుల కోసం ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్స్ ఫాలో అవుతూ ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకూడదు. ఏదైనా అధికారిక సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్స్ మాత్రమే ఫాలో కావాలి.

  First published:

  Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways

  ఉత్తమ కథలు