హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: మొత్తం 1,27,000 పోస్టుల భర్తీతో ప్రపంచంలోనే అతిపెద్ద రిక్రూట్‌మెంట్... రైల్వే అధికారిక ప్రకటన

Railway Jobs: మొత్తం 1,27,000 పోస్టుల భర్తీతో ప్రపంచంలోనే అతిపెద్ద రిక్రూట్‌మెంట్... రైల్వే అధికారిక ప్రకటన

Railway Jobs: మొత్తం 1,27,000 పోస్టుల భర్తీతో ప్రపంచంలోనే అతిపెద్ద రిక్రూట్‌మెంట్... రైల్వే అధికారిక ప్రకటన
(ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)

Railway Jobs: మొత్తం 1,27,000 పోస్టుల భర్తీతో ప్రపంచంలోనే అతిపెద్ద రిక్రూట్‌మెంట్... రైల్వే అధికారిక ప్రకటన (ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)

Indian Railway Recruitment | భారతీయ రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. వాటిలో ఒక్క నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC పోస్టులే 35,000 పైగా ఉన్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద నియామక ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. 2018లో అసిస్టెంట్ లోకోపైలట్స్ & టెక్నీషియన్ నోటిఫికేషన్‌తో పాటు గ్రూప్‌-డీ పోస్టుల భర్తీకి జారీ చేసిన మరో నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1.27 లక్షల ఖాళీల భర్తీ చేపట్టినట్టు పత్రికా ప్రకటన విడుదల చేసింది భారతీయ రైల్వే. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్ అని వెల్లడించింది. 64,000 అసిస్టెంట్ లోకోపైలట్స్ & టెక్నీషియన్ పోస్టులకు 47.45 మంది అభ్యర్థులు, 63,000 లెవెల్ 1 (గ్రూప్ డీ) పోస్టులకు 1.17 మంది అభ్యర్థులు పోటీపడ్డట్టు వెల్లడించింది. ఇక 13,500 జూనియర్ ఇంజనీర్-JE, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ మెటల్లార్జీ అసిస్టెంట్-CMA పోస్టులకు 24.75 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తంగా చూస్తే 2,40,00,000 మందికి పైగా అభ్యర్థులు రైల్వే ఉద్యోగాలకు పోటీ పడ్డారు.

Read this: RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌‌‌టీపీసీ అభ్యర్థులకు నిరాశ... పరీక్ష వాయిదా వేసిన బోర్డు

భారతదేశంలో మిగతా రంగాలతో పోలిస్తే రైల్వేలో ఉద్యోగాలకు తీవ్రమైన పోటీ ఉంటుందన్న విషయం తెలిసిందే. వేలల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైతే లక్షల్లో అభ్యర్థులు దరఖాస్తు చేయడం మామూలే. 2018లో 1.27 లక్షల పోస్టులకు 2,40,00,000 మంది అభ్యర్థులు పోటీపడటం విశేషం. ఈ పోస్టులకు కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ విజయవంతంగా పూర్తయ్యాయి. దీంతో ఈ ఖాళీల భర్తీ పూర్తయినట్టే. అంతేకాదు... 2019 లో కూడా భారతీయ రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. వాటిలో ఒక్క నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC పోస్టులే 35,000 పైగా ఉన్నాయి. ఈ పోస్టులకు 1,26,30,885 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఈ అభ్యర్థులంతా కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ 1 కోసం ఎదురుచూస్తున్నారు. మిగతా నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ కొనసాగుతోంది.

Read this: Job Notifications: రైల్వేతో పాటు పలు సంస్థల్లో 13,000 పైగా పోస్టులు... ఆ కోర్సు చేసినవారికి మాత్రమే

భారతీయ రైల్వేకు చెందిన నియామకాలన్నీ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB నిర్వహిస్తుంది. నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియకు సంబంధించిన అప్‌డేట్స్ మొత్తం ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్లల్లో ఉంటాయి. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈ అప్‌డేట్స్ ఎస్ఎంఎస్, ఇమెయిల్స్‌లో వస్తుంటాయి. అందుకే రైల్వే నియామకాలకు సంబంధించిన వివరాల కోసం ఈ వెబ్‌సైట్లను ఫాలో కావాలని, అధికారిక సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని భారతీయ రైల్వే సూచిస్తోంది. అంతేతప్ప ఉద్యోగాలకు సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే నిజాయితీ గల అభ్యర్థులను తప్పుదోవ పట్టించేంకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసే పుకార్లను, ప్రచారాలను పట్టించుకోవద్దని సూచిస్తోంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... 2029 ఖాళీల భర్తీ

Indian Navy: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో 2,700 జాబ్స్... నేటి నుంచి అప్లికేషన్స్

BEL Recruitment 2019: మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు... వివరాలివే

First published:

Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Rail, Railway Apprenticeship, Railway employees, Railways

ఉత్తమ కథలు