Home /News /jobs /

INDIAN POSTAL RECRUITMENT 2021 APPLICATION PROCESS ENDS SOON FOR 46 JOBS IN UTTAR PRADESH CIRCLE EVK

Post Office Jobs: టెన్త్, ఇంటర్ అర్హ‌త‌తో పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు ఐదు రోజులే గ‌డువు

Post Office
(ప్రతీకాత్మక చిత్రం)

Post Office (ప్రతీకాత్మక చిత్రం)

Post Office Jobs | ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ పోస్ట‌ల్‌ సర్కిల్‌లో (Uttar Pradesh Postal Circle) ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ (Application Process) కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి మరో 5 రోజులే గడువుంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

    ఇటీవల దేశ వ్యాప్తంగా పోస్టల్ ఉద్యోగాల(Post Office Jobs) భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. అనేక ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్ అర్హతగా నిర్ణయించడంతో చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నోటిఫికేషన్ల విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ స‌ర్కిల్‌లో స్పోర్ట్స్ కోటాలో పోస్ట‌ల్ స‌ర్కిల్ / సార్టింగ్ అసిస్టెంట్‌, మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌, పోస్టుమ్యాన్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఆ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఇంకా ఐదు రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 5,2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

    విద్యార్హతలు- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ కావాలి. పోస్ట్ మ్యాన్,  ఇంటర్మీడియట్ పాస్ కావడంతో పాటు తెలుగు భాష తెలిసి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు పదవ తరగతి పాస్ కావడంతో పాటు తెలుగు భాష తెలిసి ఉండాలి.
    ఇతర అర్హతలు- జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి ఉండాలి.
    వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు
    దరఖాస్తు ఫీజు- రూ.100
    వేతనం- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 బేసిక్ వేతనంతో రూ.81,100 వేతనం, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు రూ.21,700 బేసిక్ వేతనంతో రూ.69,100 వేతనం, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18,000 బేసిక్ వేతనంతో రూ.56,900 వేతనం లభిస్తుంది.

    ముఖ్య‌మైన స‌మాచారం..























    పోస్టులుపోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్/ పోస్ట్ మ్యాన్ / మల్టీ టాస్కింగ్ స్టాఫ్
    అధికారిక వెబ్‌సైట్https://www.indiapost.gov.in/
    ప‌రీక్ష ఫీజు రూ.100
    మొత్తం పోస్టులు46
    ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీఅక్టోబ‌ర్ 5, 2021

    Metro Rail Jobs : పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.ల‌క్ష‌పైనే


    అప్లై చేయండి ఇలా..
    Step 1- అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    Step 2- అనంత‌రంRecruitment పేజీలోకి వెళ్లాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)
    Step 3- నోటిఫికేష‌న్ చ‌దివి చివ‌ర‌న ఉన్న అప్లికేష‌న్ ఫాం ప్రింట్ తీసుకోవాలి.
    Step 4- అప్లికేష‌న్ ఫాంను త‌ప్పులు లేకుండా నింపి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, విద్యార్హతల వివరాలు అందించాలి.
    Step 5- అనంత‌రం అవ‌స‌ర‌మై ధ్రువ‌ప‌త్రాల‌ను పొందుప‌ర్చి
    Assistant Director (Recruitment),
    O/o The chief Postmaster General,
    Uttar Pradesh Circle,
    Lucknow – 226 001 . అడ్ర‌స్‌కు పంపాలి.
    Step 5- ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 5, 2021
    Published by:Sharath Chandra
    First published:

    Tags: CAREER, Govt Jobs 2021, Indian postal, Job notification

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు