INDIAN PARENTS SPEND RS 20000 FOR EDUCATION IN GOVT SCHOOLS RS 47000 FOR PRIVATE SURVEY GH VB
Education Expenses: పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చులపై సర్వే.. ప్రైవేట్ విద్యకు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా..
ప్రతీకాత్మక చిత్రం
తమ పిల్లల చదువు కోసం భారతదేశంలో పేరెంట్స్ ఎంత మొత్తంలో ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఓ సంస్థ సర్వే చేపట్టింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తమ పిల్లల చదువు కోసం భారతదేశంలో పేరెంట్స్(Parents) ఎంత మొత్తంలో ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఓ సంస్థ సర్వే(Survey) చేపట్టింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం వారి తల్లిదండ్రులు ఏడాదికి సుమారు రూ.20,000 ఖర్చు చేస్తున్నారని సర్వేలో తేలింది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్(Private Un Aided) పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు రెట్టింపు కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఏటా సగటున ప్రైవేట్ ఎడ్యుకేషన్(Education) కోసం దాదాపు రూ.47,000 ఖర్చు చేస్తున్నారని సర్వే తేల్చింది. ఇందులో స్కూల్ ఫీజులు, రవాణా, మౌలిక సదుపాయాలు, తరగతి గది సౌకర్యాలు వంటి ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి.
ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ ‘స్కూల్‌నెట్ ఇండియా లిమిటెడ్’ దేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చదువుకు అవుతున్న మొత్తం ఖర్చు ఎంతో తెలుసుకోవడానికి ‘‘అండర్స్టాండింగ్ ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్ స్పెండ్స్ ల్యాండ్‌స్కేప్’’ పేరుతో ఓ సర్వే చేపట్టింది. ఇందుకు PGA ల్యాబ్ సహకారం తీసుకుంది.
సర్వే రిపోర్ట్ ప్రకారం.. 6 శాతం మంది తల్లిదండ్రులు కేంద్రీయ విద్యాలయాలు వంటి ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల విద్య కోసం రూ. 51,000 నుండి రూ. 1,00,000 వరకు వెచ్చిస్తున్నారు. అలాగే అన్ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో విద్య కోసం 28 శాతం మంది తల్లిదండ్రులు కూడా ఇంతే మొత్తాన్ని వెచ్చిస్తున్నారని సర్వేలో తేలింది.
సర్వే కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్లో 480 మంది, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల పిల్లల తల్లిదండ్రుల్లో 437 మంది నుంచి డేటా స్వీకరించారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే 75 శాతం మంది విద్యార్థులు తమ స్థోమత బట్టి బడ్జెట్‌కు అనుగుణంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్‌కు వెళుతున్నారు.
మరికొన్ని విషయాలను సర్వే వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల కుటుంబాల్లో దాదాపు 56 శాతం కుటుంబాలు పాఠశాల ఖర్చుల కోసం సంవత్సరానికి రూ.15,000 కంటే తక్కువ ఖర్చు చేస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా పాఠశాల ఖర్చు కాకుండా సగటున మరో రూ.14,000 అదనంగా ఖర్చు చేస్తున్నారు. పర్సనల్ ట్యూటర్లు, ట్యూషన్ తరగతులు, పోటీ పరీక్షల కోచింగ్ వంటి అంశాలు ఇందులోకి వస్తాయి.
ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 36 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల పాఠశాల విద్యకు రూ. 50,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అలాగే 3 శాతం మంది తల్లిదండ్రులు కూడా సప్లిమెంటరీ ఎడ్యుకేషన్ కోసం ఇంతే మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. పాఠశాల విద్యపై మొత్తం ఖర్చులో భాగంగా, 36 శాతం మంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో ట్యూషన్ ఫీజుగా రూ. 5,000 కంటే తక్కువ ఖర్చు చేస్తున్నారు. అయితే మరో 12 శాతం మంది అస్సలు ఖర్చు చేయడం లేదని సర్వేలో తేలింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో 60 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు అనుబంధ విద్య అవసరాలకు అదనంగా రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని సర్వే పేర్కొంది.
ఈ సర్వే గురించి స్కూల్‌నెట్ స్ట్రాటజీ హెడ్ అరిందమ్ ఘోష్ మాట్లాడుతూ.. గత రెండేళ్ల నుంచి పాఠశాలల్లో, ఆపై తరగతుల్లో డిజిటల్ లెర్నింగ్ సొల్యూషన్స్ డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందన్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడం లేదని ఈ సర్వే ద్వారా బహిర్గతమైందన్నారు. పాఠశాల ఖర్చులకు తోడుగా అదనంగా మరికొన్నిటిని (ట్యూషన్స్) స్వీకరించడం ద్వారా ఖర్చులు మరింత పెరిగాయని అరిందమ్ తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.