• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • INDIAN OIL INVITES APPLICATIONS TO FILL VACANCIES IN BARAUNI REFINERY BIHAR NS

IOCL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీకి IOCL నుంచి మరో నోటిఫికేషన్.. వివరాలివే

IOCL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీకి IOCL నుంచి మరో నోటిఫికేషన్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOCL) శుభవార్త చెప్పింది. ఇటీవలి కాలంలో వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తున్న ఈ సంస్థ తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • Share this:
    నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOCL) శుభవార్త చెప్పింది. ఇటీవలి కాలంలో వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తున్న ఈ సంస్థ తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొడక్షన్ విభాగంలో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్ సైట్లో ఫిబ్రవరి 19లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 25 వేల నుంచి రూ.1.05 లక్షలను వేతనంగా చెల్లించనున్నారు.

    విద్యార్హతల వివరాలు..
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కెమికల్, పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమో కోర్సు చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. లేదా మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రీ కెమిస్ట్రీ తదితర సబ్జెక్టుల్లో బీఎస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు ఆయా విద్యార్హతలను గుర్తింపు పొందిన విద్యాసంస్థలు లేదా యూనివర్సిటీ నుంచి పొంది ఉండాలి. 50 శాతం మార్కులు పొంది ఉండాలి. SC/ST అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులు నోటిఫికేషన్లో సూచించిన విభాగంలో ఏడాది పాటు పని చేసిన అనుభవం ఉండాలి. పార్ట్ టైం/దూర విద్యాకోర్సుల్లో విద్యను అభ్యసించిన వారు దరఖాస్తుకు అనర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

    ఎలా అప్లై చేయాలంటే..
    దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 19లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అన్లైన్లో అప్లై చేసిన అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకోవాలి. అనంతరం నోటిఫికేషన్లో సూచించిన ధ్రువపత్రాలను జత చేసి Dy. General Manager (HR), Barauni Refinery, P.O. Barauni Oil Refinery, Begusarai, Bihar – 851114 చిరునామాకు పోస్టులో పంపించాల్సి ఉంటుంది. ఈ పత్రాలు ఫిబ్రవరి 27లోగా చేరేలా పంపించాలి. అనంతరం వచ్చే దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు. ఇతర పూర్తి వివరాలను కింద ఇచ్చిన లింక్ ద్వారా నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
    Official Notification

    అభ్యర్థుల ఎంపిక..
    రాత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు/ఫిజికల్ టెస్ట్ లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే మెరిట్ లీస్ట్ రూపొందిస్తారు. ఇతర ఎలాంటి పరీక్షలు ఉండవు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు