ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్- IOCL దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్-2021 స్కోరు ఆధారంగా ఇంజినీర్లు, ఆఫీసర్లు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లను నియమించుకోనుంది. మొత్తం నియామక ప్రక్రియను ఆన్లైన్లోనే నిర్వహిస్తామని తెలిపింది. తొలుత గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటిలో ప్రతిభ కనబర్చిన వారిని నియమించుకోనున్నారు. కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా విభాగాల్లో గేట్–2021 క్వాలిఫ అయిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గతంలో గేట్ పరీక్షలో అర్హత సాధించినా సరే ఆ స్కోర్‌ను పరిగణలోకి తీసుకోరు. అర్హులైన అభ్యర్థులు జూలై 26లోపు దరఖాస్తు చేసుకోవాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) స్పష్టం చేసింది.
AP Jobs 2021: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో 319 ఉద్యోగాలు... 3 రోజులే గడువు
SBI Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఎస్బీఐలో 6100 జాబ్స్... అప్లై చేయండి ఇలా
దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. అభ్యర్థులు తమ ఈ–మెయిల్ ఐడి, మొబైల్ నంబర్‌త రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. తర్వాత అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేసి, ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదవాలి. ఆ తర్వాత ఆన్లైన్ ఫారమ్‌ను పూరించాలి. అప్లికేషన్ ఫారమ్‌లో గేట్–2021 రిజిస్ట్రేషన్ నంబర్, విద్యార్హతలు, గేట్ స్కోరు (100కు ఎంత స్కోర్) వంటి వివరాలు నమోదు చేయాలి. తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్.. అంటే/7+ ఇటీవలి కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ స్కాన్ కాపీ, సిగ్రేచర్ స్కాన్ చేసిన కాపీ, ఆధార్ కార్డు వంటివి అప్లోడ్ చేయాలి. ఒక్కసారి ఆన్లైన్ దరఖాస్తు సబ్మిట్ చేశాక ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదని అభ్యర్థులు గుర్తించుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు వారి కేటగిరీ సర్టిఫికేట్‌ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
IBPS Clerk Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 5,830 పైగా క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
ఒకవేళ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడంలో విఫలమైతే, వారిని జనరల్ కేటగిరీ కిందే పరిగణిస్తారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పిడిఎఫ్ ఫార్మాట్లో ప్రింటవుట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. ఈ ప్రింటౌట్ను ఇండియన్ ఆయిల్ ఏ కార్యాలయానికి పంపించాల్సిన అవసరం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Indian Oil Corporation, Job notification, JOBS, NOTIFICATION, Telangana government jobs, Telangana jobs, Tspsc jobs, Upcoming jobs