Navy Jobs: టెన్త్ పాసయ్యారా? ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

Navy Jobs: టెన్త్ పాసయ్యారా? ఇండియన్ నేవీలో ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)

Indian Navy Jobs | అభ్యర్థులకు ఆన్‌లైన్ అప్లికేషన్‌కు సంబంధించిన అలర్ట్స్ వస్తాయి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకొని వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

  • Share this:
    ఇండియన్ నేవీలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. టెన్త్ పాసైతే చాలు నేవీలో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తోంది. కేవలం పదో తరగతి విద్యార్హతతో సెయిలర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇండియన్ నేవీ. ఇందుకోసం 'ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్-INET' నిర్వహించనుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ సెప్టెంబర్‌లో జరగనుంది. ఎంట్రీ సెయిలర్స్‌ని షెఫ్, స్టీవార్డ్, హైజీనిస్ట్ పోస్టుల్లో నియమించనుంది ఇండియన్ నేవీ. ఆసక్తిగల అభ్యర్థులు www.joinindiannavy.gov.in వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ అప్లికేషన్‌కు సంబంధించిన అలర్ట్స్ వస్తాయి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకొని వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అర్హత పొందిన అభ్యర్థులకు ఒడిషాలోని ఐఎన్ఎస్ చిల్కాలో ఎన్‌రోల్‌మెంట్ ఉంటుంది. 2020 ఏప్రిల్‌లో శిక్షణ ప్రారంభమవుతుంది.

    Indian Navy Recruitment: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    పోస్ట్: ఎంట్రీ సెయిలర్స్‌...షెఫ్, స్టీవార్డ్, హైజీనిస్ట్‌గా నియామకం
    విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణత
    వయస్సు: 2000 ఏప్రిల్ 1 నుంచి 2003 మార్చి 31 వరకు పుట్టినవారికే అవకాశం
    పెళ్లికాని యువకులకే అవకాశం
    నియామక ప్రక్రియ: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్
    పరీక్ష ఫీజు: రూ.60 + జీఎస్‌టీ

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి...


    ఇవి కూడా చదవండి:

    VIZAG Steel Jobs: వైజాగ్ స్టీల్ అనుబంధ సంస్థలో 594 ట్రైనీ పోస్టులు

    RRB: ఆర్ఆర్‌బీ ఉద్యోగానికి దరఖాస్తు చేశారా? అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి ఇలా

    Jobs: పోస్ట్ ఆఫీస్‌లో డ్రైవర్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
    First published: