హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Indian Navy: మహిళా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. వచ్చే ఏడాది నుంచి నేవీ అన్ని విభాగాల్లో మహిళల రిక్రూట్‌మెంట్‌

Indian Navy: మహిళా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. వచ్చే ఏడాది నుంచి నేవీ అన్ని విభాగాల్లో మహిళల రిక్రూట్‌మెంట్‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం మహిళలు అన్ని విభాగాల్లో రాణిస్తున్నారు. తాజాగా త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ.. మహిళా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌ అందజేసింది. వచ్చే ఏడాది నుంచి నేవీలోని ప్రతి విభాగంలో మహిళలను రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Indian Navy : ప్రస్తుతం మహిళలు అన్ని విభాగాల్లో రాణిస్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే చేయగలరనే అపోహలున్న రంగాల్లో కూడా సత్తా చాటుతున్నారు. దీంతో ఏటా మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ(Indian Navy).. మహిళా అభ్యర్థులకు(women Candidates) గుడ్‌న్యూస్‌ అందజేసింది. వచ్చే ఏడాది నుంచి నేవీలోని ప్రతి విభాగంలో మహిళలను రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నావల్ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఇటీవల వివరాలు వెల్లడించారు.

ప్రస్తుతం కొన్ని శాఖల్లోనే అవకాశాలు

ఇప్పటివరకు నేవీ దాదాపు ఏడు నుంచి ఎనిమిది శాఖల్లో మాత్రమే మహిళలను రిక్రూట్ చేసుకుంటోంది. అయితే వచ్చే ఏడాది నుంచి అన్ని శాఖల్లో మహిళా అధికారులను నియమించుకోనుంది. డిసెంబర్ 4న జరిగిన నేవీ డే వేడుకల సందర్భంగా ఇండియన్ నేవీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో కరాచీ నౌకాశ్రయంపై భారత నేవీ దళం దాడి చేసి యుద్ధంలో గెలుపొందింది. ఈ సందర్భంగా ఏటా డిసెంబర్ 4ను భారత్ నేవీ డేని నిర్వహిస్తున్నారు.

 తొలిసారిగా మహిళా నావికుల రిక్రూట్‌మెంట్‌

చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ మాట్లాడుతూ.. అగ్నిపథ్ పథకం కింద ఇండియన్ నేవీ మొదటి బ్యాచ్‌లో సుమారు 3,000 మంది అగ్నివీర్స్ ఎంపికైనట్లు చెప్పారు. వీరిలో 341 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. ఇది ల్యాండ్‌మార్క్ ఈవెంట్ లాంటిదని, మహిళా నావికులు మొదటిసారిగా నావికాదళంలోకి ప్రవేశించారని పేర్కొన్నారు. గత 16-17 సంవత్సరాలుగా మహిళా అధకారులను చేర్చుకుంటున్నామని, అయితే మహిళా నావికులను చేర్చుకోవడం ఇదే మొదటిసారని అన్నారు. ఇప్పటి వరకు కేవలం ఏడు నుంచి ఎనిమిది శాఖలకు మాత్రమే మహిళా అధికారులను పరిమితం చేశామని, ఇకపై వచ్చే ఏడాది నుంచి అన్ని శాఖల్లో మహిళా అధికారులను నియమించుకుంటామని హరికుమార్ స్పష్టం చేశారు.

CUET-2023: త్వరలోనే సీయూఈటీ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదల చేయనున్న NTA..సిలబస్ వివరాలు ఇవే..

పెరగనున్న మహిళా అధికారులు

నేవీ అధికారుల సమాచారం మేరకు.. గతేడాది డిసెంబర్‌లో విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యతో సహా 15 ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకల్లో 28 మంది మహిళా అధికారులను మోహరించారు. ఈ సంఖ్య ఇకపై మరింత పెరగనుంది. గత ఏడాది నావికాదళ కార్యాచరణ బిజీగా, సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ఇది అనేక విధాలుగా రూపాంతరం చెందిందని చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ అన్నారు. మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక INS విక్రాంత్‌ను సెప్టెంబర్ 2న ప్రారంభించడం దేశానికే గర్వకారణమన్నారు. ఇది నౌకాదళ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘటన అని ఆయన కొనియాడారు. ఈ నౌక ఆత్మ నిర్భర్ భారత్‌కు టార్చ్ బేరర్‌గా ఉండనుందని, ఇది మన భావితరాలను స్వావలంబన దిశగా ప్రేరేపిస్తుందన్నారు.

First published:

Tags: Career and Courses, Indian Navy

ఉత్తమ కథలు