హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Indian Navy: పది అర్హతతో నేవీ అగ్నివీర్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ ఇలా..

Indian Navy: పది అర్హతతో నేవీ అగ్నివీర్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Indian Navy: ఎంఆర్ అగ్నివీర్‌ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి పాసై ఉండాలి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

త్రివిధ దళాల్లో తాత్కాలిక ప్రాతిపదికగా రిక్రూట్‌మెంట్ చేపట్టడానికి భారత ప్రభుత్వం (Central Government) అగ్నిపథ్ ( Agnipath) పథకాన్ని ఈ ఏడాది తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా ఇండియన్ నేవీ (Indian Navy).. మెట్రిక్ రిక్రూట్(MR)విభాగంలో అగ్నివీర్‌లను నియమించుకోనుంది. ఈ మేరకు ఇండియన్ నేవీ డిసెంబర్ 8న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 20 పోస్టులు మహిళా అభ్యర్థులకు కేటాయించారు. అర్హులైన అభ్యర్థులు నేవీ అధికారిక పోర్టల్ www.joinindiannavy.gov.in ద్వారా డిసెంబర్ 17లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

* అర్హత ప్రమాణాలు

ఎంఆర్ అగ్నివీర్‌ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి పాసై ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా 2002 మే 1 నుంచి 2005 అక్టోబర్ 31 మధ్య జన్మించి ఉండాలి. పెళ్లి కాని అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తు ప్రక్రియ

ముందుగా ఇండియన్ నేవీ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. ఒకవేళ ఇప్పటికే రిజిస్టర్ కాకపోయి ఉంటే, హోమ్ పేజీలో రిజిస్టర్ ట్యాబ్‌పై క్లిక్ చేసి ఇమెయిల్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ఇమెయిల్ అడ్రస్‌తో లాగిన్ అయి, Current Opportunities‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత అప్లై చేయడానికి అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి. అవసరమైన వివరాలు ఎంటర్‌ చేయాలి, డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్ చేయాలి.

అనంతరం అప్లికేషన్ ఫీజును చెల్లించి, అప్లికేషన్‌ సబ్‌మిట్‌ చేయాలి. నేవీ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే, అభ్యర్థులు రూ.550 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫీజుకు అదనంగా 18శాతం జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా ఇతర ఆన్‌లైన్ చెల్లింపు విధానం ద్వారా ఫీజును చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన అభ్యర్థులకు మాత్రమే అడ్మిట్ కార్డులు అందుతాయి.

ఇది కూడా చదవండి :  కేంద్రంలో 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు.. కేంద్ర మంత్రి చెప్పిన పూర్తి లెక్కలివే!

* ఎంపిక ప్రక్రియ

ఇండియన్ నేవీలో ఎంఆర్ అగ్నివీర్‌ల ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను మొదట షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. ఆ తరువాతి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పాసైన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఇనిషియల్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ తరువాత ఫైనల్‌గా రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఫిక్స్‌డ్ వార్షిక ఇంక్రిమెంట్‌తో నెలకు రూ.30,000ల జీతం లభిస్తుంది. అంతేకాకుండా రిస్క్, హార్డ్‌షిప్, డ్రస్, ప్రయాణ ఖర్చులకు కూడా పరిహారం లభిస్తుంది. ఈ అగ్నివీర్లు నాలుగేళ్ల పాటు సర్వీస్‌లో ఉంటారు.

First published:

Tags: Agnipath Scheme, Agniveer, Indian Navy, JOBS, Latest jobs

ఉత్తమ కథలు