ఇంటర్మీడియట్ పాసయ్యారా? ఇండియన్ నేవీలో చేరడం మీ కలా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీ సెయిలర్ విభాగంలో సీనియర్ సెకండరీ రిక్రూట్స్-SSR, ఆర్టిఫిషర్ అప్రెంటీస్-AA పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు 2021 ఏప్రిల్ 26న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 30 లోగా అప్లై చేయాలి. పెళ్లికాని యువకులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టుల్ని భర్తీ చేయనుందో ఇండియన్ నేవీ ప్రకటించలేదు. అయితే గతేడాది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2700 పోస్టుల్ని భర్తీ చేసింది. అందులో సీనియర్ సెకండరీ రిక్రూట్స్ పోస్టులు 2200, ఆర్టిఫిషర్ అప్రెంటీస్ పోస్టులు 500 ఉన్నాయి. ఈసారి కూడా అంతే మొత్తంలో పోస్టుల్ని భర్తీ చేసే అవకాశం ఉంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఖాళీల వివరాలు తెలుస్తాయి.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ వెబ్సైట్ https://www.joinindiannavy.gov.in/ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో అధికారిక నోటిఫికేషన్‌ను ఉంటుంది. అభ్యర్థులు ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు, ఇతర అర్హతల గురించి తెలుసుకోవాలి.
Indian Navy SSR AA Recruitment 2021: నోటిఫికేషన్ వివరాలు ఇవే...
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 26
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 30
భర్తీ చేసే పోస్టులు- సీనియర్ సెకండరీ రిక్రూట్స్, ఆర్టిఫిషర్ అప్రెంటీస్
విద్యార్హతలు- సీనియర్ సెకండరీ రిక్రూట్స్ పోస్టుకు మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌లో ఏదైనా ఓ సబ్జెక్ట్‌తో ఇంటర్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఆర్టిఫిషర్ అప్రెంటీస్ పోస్టుకు మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌లో ఏదైనా ఓ సబ్జెక్ట్‌తో ఇంటర్ పాస్ కావాలి.
దరఖాస్తు ఫీజు- రూ.215. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు
ఎంపిక విధానం- ఆన్లైన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్
వేతనం- శిక్షణా కాలంలో నెలకు రూ.14,600 స్టైపెండ్ లభిస్తుంది. ఆ తర్వాత డిఫెన్స్ పే మ్యాట్రిక్స్లో లెవెల్ 3 వేతనం లభిస్తుంది.
Indian Navy SSR AA Recruitment 2021: అప్లై చేయండి ఇలా
ముందుగా https://www.joinindiannavy.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
SSR AA నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.
Apply Online పైన క్లిక్ చేయాలి.
వివరాలన్నీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.