ఇండియన్ నేవీలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. నేవీలో ఖాళీల భర్తీకి షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. సాధారణంగా ప్రతీ ఏటా ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్-INET ధ్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐనెట్ నిర్వహించట్లేదు. సర్వీస్ సెలక్షన్ బోర్డ్-SSB మార్కుల ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇండియన్ నేవీ. ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జూలై 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. పెళ్లికాని పురుషులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో కోర్సు 2022 జనవరిలో ప్రారంభం అవుతుంది. కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నావల్ అకాడమీలో కోర్సు ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 30
కోర్సు ప్రారంభం- 2022 జనవరి
ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ- 2021 సెప్టెంబర్ 21 నుంచి
DRDO Jobs 2021: డీఆర్డీఓలో ఉద్యోగాలు... రేపటిలోగా అప్లై చేయండి
BSF Recruitment 2021: బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 285 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు- 40
విద్యార్హతలు- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో బీఈ లేదా బీటెక్ డిగ్రీ పాస్ కావాలి.
వయస్సు- 1997 జనవరి 2 నుంచి 2002 జూలై 1 మధ్య జన్మించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం- ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, మెరిట్ లిస్ట్
ఇంటర్వ్యూ జరిగే స్థలం- విశాఖపట్నం, బెంగళూరు, కోల్‌కతా, భోపాల్
SBI Jobs 2021: డిగ్రీ పాస్ అయ్యారా? ఎస్బీఐలో 6100 ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా
TCS National Qualifier Test: కార్పొరేట్ కంపెనీలో జాబ్ మీ కలా? మీ ఇంటి నుంచే ఈ ఎగ్జామ్ రాయండి
అభ్యర్థులు https://www.joinindiannavy.gov.in/ వెబ్సైట్లో ఓపెన్ చేయాలి.
ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో నోటిఫికేషన్ ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత APPLY ONLINE పైన క్లిక్ చేయాలి.
పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Indian Navy, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs