హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Indian Navy Recruitment 2021: ఇండియ‌న్ నేవీలో 181 ఆఫీస‌ర్ ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక

Indian Navy Recruitment 2021: ఇండియ‌న్ నేవీలో 181 ఆఫీస‌ర్ ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఇండియన్ నేవీ(Indian Navy) పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్(Notification)ను విడుదల చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్(Short Service Commission) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...

ఇండియన్ నేవీ(Indian Navy) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్(Notification) విడుదలైంది. షార్ట్ సర్వీస్ కమిషన్(Short Service Commission) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 181 ఖాళీలను ఈ నోటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించిన నేవెల్ ఓరియెంటేషన్ కోర్సు జూన్ 2022లో ప్రారంభం కానుంది. ఎంపిక కేవలం ఇంట‌ర్వ్యూ(Interview) ద్వారా ఉంటుంది. అకాడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనున్నారు. అప్లికేష‌న్(Application) ప్ర‌క్రియ సెప్టెంబ‌ర్ 18, 2021న మొద‌లై అక్టోబ‌ర్ 5, 2021 వ‌ర‌కు ఉంటుంది. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ సారి ఏ ప‌రీక్ష లేకుండా నేవీ ఉద్యోగ అవ‌కాశం క‌ల్పిస్తోంది.


అర్హతలు.. ఖాళీల వివరాలు

పోస్టు పేరుఅర్హతలుఖాళీలు
జనరల్ సర్వీస్ (హైడ్రో కార్డ్)60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో  ఇంజనీరింగ్ (బీఈ/బీటెక్) పూర్తి చేసి ఉండాలి45
అబ్సర్వర్60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో  ఇంజనీరింగ్ (బీఈ/బీటెక్) పూర్తి చేసి ఉండాలి04
పైలట్60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో  ఇంజనీరింగ్ (బీఈ/బీటెక్) పూర్తి చేసి ఉండాలి15
లాజిస్టిక్స్ఫస్ట్ క్లాస్ మార్కులతో బీఈ/బీటెక్ లేదా ఎంబీఏ లేదా బీఎస్సీ, బీకాం, బీఎస్సీ(ఐటీ) లేదా ఎంసీఏ/  ఎంఎస్సీ18
ఎడ్యుకేషన్60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/  ఎంఎస్సీ లేదా 55 శాతం మార్కులతో ఎంఏ (హిస్టరీ)18
ఇంజనీరింగ్ బ్రాంచ్60శాతం మార్కులతో బీఈ, బీటెక్ చేసి ఉండాలి.27
ఎలక్ట్రికల్ బ్రాంచ్60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ చేసి ఉండాలి34
నేవల్  ఆర్కిటెక్60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ చేసి ఉండాలి12
మొత్తం---181


CLW Recruitment 2021: సీఎల్‌డ‌బ్ల్యూలో 492 అప్రెంటీస్ పోస్టులు


ముఖ్యమైన తేదీలు

- ద‌ర‌ఖాస్తు ప్రారంభం : సెప్టెంబ‌ర్ 18, 2021

- ద‌ర‌ఖాస్తు ముగింపు : అక్టోబ‌ర్ 5, 2021

- కోర్సు ప్రారంభం : జూన్ 2022

ఎంపిక విధానం..

- కేవ‌లం ఇంట‌ర్వ్యూ ద్వారానే ఎంపిక ఉంటుంది.

- ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల అక‌డ‌మిక్ మార్కుల(Marks) ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.

- ఎటువంటి రాత ప‌రీక్ష లేదు.

- ఎంపికైన అభ్యర్థుల‌కు మెయిల్ ద్వారా స‌మాచారం అందిస్తారు.

- ఎంపికైన అభ్య‌ర్థుల‌కు కోర్సు జూన్ 22, 2022 న ప్రారంభం అవుతుంది.

ద‌ర‌ఖాస్తు విధానం..

- అభ్య‌ర్థి ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.joinindiannavy.gov.in/ ను సంద‌ర్శించాలి.

- అనంత‌రం నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

- సెప్టెంబ‌ర్ 18న తెరుచుకొనే ఆన్‌లైన్ అప్లికేష‌న్‌లోకి వెళ్లి పూర్తి వివ‌రాలు అందించాలి.

- ఈ-మెయిల్‌, మొబైల్ నంబ‌ర్(Mobile number) స‌రిగా ఇవ్వాలి. వాటి ద్వారానే భ‌విష్య‌త్‌లో ఎంపిక విధానం స‌మాచారం అందుతుంది.

- విద్యార్హ‌త‌ల‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్ల‌(Documents)ను స్కాన్ కాపీ రూపంలో అప్‌లోడ్ చేయాలి.

- స్కాన్ కాపీ స‌రిగా లేకుంటే అప్లికేష‌న్ తిర‌స్క‌రిస్తారు.

- అనంత‌రం త‌ప్పులు లేకుండా అప్లికేష‌న్ ఫాం నింపి సబ్‌మిట్ చేయాలి.

First published:

Tags: CAREER, Government jobs, Govt Jobs 2021, Indian Navy, Job notification, JOBS

ఉత్తమ కథలు