news18-telugu
Updated: May 22, 2019, 11:19 AM IST
ఇండియన్ నేవీలో ఉద్యోగాలు..
ఇండియన్ నేవీలో ఉద్యోగాలకోసం దరఖాస్తులు కోరుతున్నారు. చార్జ్‌మ్యాన్ పోస్టుల కోసం మెకానిక్, అమ్యునిషన్, ఎక్స్‌ప్లోజివ్ విభాగాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులు మెకానిక్ విభాగానికి మెకానికల్/ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత పొందిన వారు.. సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులుగా తెలిపారు అధికారులు. దరఖాస్తు చేసుకున్నవారు అర్హతలను బట్టి స్క్రూటినీ చేసి ఆన్లైన్ టెస్ట్‌కి పిలుస్తారు.
పోస్టులు : చార్జ్‌మ్యాన్(మెకానిక్/అమ్యునిషన్,ఎక్స్‌ప్లోజివ్)
విభాగాల వారీగా ఖాళీలు : మెకానిక్ 103, అమ్యునిషన్, ఎక్స్‌ప్లోజివ్ 69
అర్హతలు : మెకానికల్ విభాగానికి మెకానికల్/ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
అమ్యునిషన్ విభాగానికి కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు : 30 ఏళ్లు మించరాదు. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది)
ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్ ద్వారా
ఆన్లైన్ టెస్ట్: ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలుంటాయి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్లో
చివరితేదీ : మే 26
ఫీజు : రూ.205(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, ఎక్స్సర్వీస్మెన్లకు ఎటువంటి ఫీజు లేదు)
వెబ్సైట్ : www.joinindiannavy.gov.in
ఇవి కూడా చదవండి..
AP SSC Mark sheet : టెన్త్‌క్లాస్ షార్ట్ మెమోలు వచ్చేశాయి.. డౌన్లోడ్ ఇలా చేసుకోండి..
First published:
May 22, 2019, 11:19 AM IST