ఇండియన్ నేవీలో చేరాలనుకునేవారికి శుభవార్త. ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ నేవీ. మొత్తం 1159 ఖాళీలను ప్రకటించింది. ఇందులో 710 పోస్టులు విశాఖపట్నంలో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2021 ఫిబ్రవరి 22న మొదలవుతుంది. అదే రోజున https://www.joinindiannavy.gov.in/ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అవుతుంది. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అప్లై చేయడానికి 2021 మార్చి 7 చివరి తేదీ. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్- INCET ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఆయా కమాండ్ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వొచ్చు.
మొత్తం ఖాళీలు- 1159
హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నావల్ కమాండ్, విశాఖపట్నం- 710
హెడ్‌క్వార్టర్స్ వెస్టర్న్ నావల్ కమాండ్, ముంబై- 324
హెడ్‌క్వార్టర్స్ సదరన్ నావల్ కమాండ్, కొచ్చి- 125
AP Post Office Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో 2296 జాబ్స్... అప్లై చేయండి ఇలా
IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 255 గ్రూప్ సీ ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 22
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 7
ఆన్లైన్ ఎగ్జామ్- తేదీలను త్వరలో వెల్లడించనున్న ఇండియన్ నేవీ
విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు
ఎంపిక విధానం- ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
దరఖాస్తు ఫీజు- రూ.205. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు లేదు
Telangana Post Office Jobs: తెలంగాణలోని పోస్ట్ ఆఫీసుల్లో 1150 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రాసెస్ ఇదే
4 Day Work: వారానికి 4 రోజులు డ్యూటీ... 3 రోజులు వీకాఫ్... అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం
అభ్యర్థులు ముందుగా https://www.joinindiannavy.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Join Navy పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Ways to join పైన క్లిక్ చేసి Civilians పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Tradesman Mate పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీ వివరాలతో రిజిస్టర్ చేయాలి.
సర్టిఫికెట్లు, ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Exams, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Telugu news, Telugu updates, Telugu varthalu, Visakha, Visakhapatnam