ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. మ్యాట్రిక్ రిక్రూట్ అక్టోబర్ 2021 బ్యాచ్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది ఇండియన్ నేవీ. పెళ్లి కాని పురుషులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. అప్లై చేయడానికి 2021 జూలై 23 చివరి తేదీ. మొత్తం 350 సెయిలర్ పోస్టులున్నాయి. శిక్షణ విజయవంతమైనవారిని నియమించుకుంటారు. 15 ఏళ్ల కాలానికి రిక్రూట్మెంట్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 19
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 23
పోస్టుల వివరాలు- షెఫ్, స్టీవార్డ్, శానిటరీ హైజీనిస్ట్
విద్యార్హతలు- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ కావాలి.
వయస్సు- 17 నుంచి 20 ఏళ్లు. 2001 ఏప్రిల్ 1 నుంచి 2004 సెప్టెంబర్ 30 మధ్య జన్మించినవారికి అవకాశం ఉంటుంది.
శిక్షణ- ఐఎన్ఎస్ చిల్కాలో 14 వారాల బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది.
స్టైపెండ్- నెలకు రూ.14,000. శిక్షణ పూర్తైన తర్వాత డిఫెన్స్ పే మ్యాట్రిక్స్లో లెవెల్ 3 వర్తిస్తుంది. బేసిక్ వేతనం రూ.21,700 ఉంటుంది.
ఎంపిక విధానం- 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మొత్తం 1750 అభ్యర్థులను రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌కు పిలుస్తారు. కటాఫ్ మార్క్స్ వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరుగా ఉంటుంది.
BDL Recruitment 2021: హైదరాబాద్‌లోని బీడీఎల్‌లో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్
Jobs: రైల్వే విద్యా సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
అభ్యర్థులు ముందుగా ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్ https://www.joinindiannavy.gov.in/ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో అభ్యర్థి వివరాలతో రిజిస్టర్ చేయాలి.
ప్రొఫెల్ క్రియేట్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీతో లాగిన్ కావాలి.
ఆ తర్వాత Current Opportunities పైన క్లిక్ చేయాలి.
Apply బటన్ పైన క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.
High Court Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని హైకోర్టులో ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ
Indian Navy Jobs 2021: ఇండియన్ నేవీలో జాబ్స్... పరీక్ష లేదు... విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు
ఇక ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో 40 పోస్టుల భర్తీ జరుగుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జూలై 30 చివరి తేదీ. కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నావల్ అకాడమీలో ఎలక్ట్రికల్ బ్రాంచ్ కోర్సు 2022 జనవరిలో మొదలవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Indian Navy, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs