news18-telugu
Updated: March 27, 2020, 6:21 PM IST
Indian Navy Jobs: టెన్త్, ఇంటర్ పాసైనవారికి ఇండియన్ నేవీలో ఉద్యోగావకాశాలు
(ప్రతీకాత్మక చిత్రం)
మీరు టెన్త్ పాసయ్యారా? ఇంటర్ పూర్తి చేశారా? ఇండియన్ నేవీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. 10వ తరగతి, 12వ తరగతి పాసైనవారిని సెయిలర్ పోస్టుల్లో నియమించనుంది. సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR, మెట్రిక్ రిక్రూట్-MR, ఆర్టిఫిషర్ అప్రెంటీసెస్-AA పోస్టులున్నాయి. పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో అప్లై చేయాలి.
Indian Navy Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...
భర్తీ చేయనున్న పోస్టులు- సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR, మెట్రిక్ రిక్రూట్-MR, ఆర్టిఫిషర్ అప్రెంటీసెస్-AA
విద్యార్హత- ఎస్ఎస్ఆర్ పోస్టుకు మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ / బయాలజీ / కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో 12వ తరగతి 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఎంఆర్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి.
నోటిఫికేషన్ విడుదల- డిసెంబర్-జనవరి, జూన్-జూలై
ఎంపిక విధానం- రాతపరీక్ష, ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఇవి కూడా చదవండి:
Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Internship: డిగ్రీ విద్యార్థులకు రాజ్యసభలో ఇంటర్న్‌షిప్... పూర్తి వివరాలివే
Published by:
Santhosh Kumar S
First published:
March 27, 2020, 6:21 PM IST