బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్. బీటెక్ చదువుతుండగానే ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందే అవకాశమిది. ఇండియన్ నేవీలో ఎగ్జిక్యూటీవ్-ఐటీ, టెక్నికల్ విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్స్ పోస్టులున్నాయి. యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ ద్వారా వీటిని నియమించనుంది ఇండియన్ నేవీ. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 2019 జూన్ 27 లోగా
https://www.joinindiannavy.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులకు నావల్ క్యాంపస్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూ తర్వాత SSB ఇంటర్వ్యూ ఉంటుంది. బెంగళూరు, భోపాల్, కొయంబత్తూర్, విశాఖపట్నం, కోల్‌కతాలో 2019 డిసెంబర్ నుంచి 2020 ఏప్రిల్ మధ్య ఇంటర్వ్యూలు ఉంటాయి. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే కటాఫ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Indian Navy Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...
దరఖాస్తు ప్రారంభం: 2019 జూన్ 7
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూన్ 27
వయస్సు: 1996 జూలై 2 నుంచి 1999 జూలై 1 మధ్య పుట్టినవారికి అవకాశం.
విద్యార్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ విభాగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్, ఇంజనీరింగ్ విభాగంలో మెకానికల్, మెరైన్, ఇన్స్ట్రుమెంటేషన్, ప్రొడక్షన్, ఏరోనాటికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, కంట్రోల్ ఇంజనీరింగ్, ఏరో స్పేస్, ఆటోమొబైల్స్, మెటాల్లర్జీ, మెకట్రానిక్స్, ఇన్స్ట్యుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఇంజనీరింగ్, కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఏవియానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ చదివే విద్యార్థులు అర్హులు.
Indian Navy Recruitment 2019: దరఖాస్తు చేయండి ఇలా...
ముందుగా ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్
https://www.joinindiannavy.gov.in/ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో 'apply online' పైన క్లిక్ చేయండి.
మీకు అకౌంట్ లేకపోతే కొత్త అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
అకౌంట్ ఉంటే ఇమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
కావాల్సిన సమాచారాన్ని వెల్లడించి దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ఫామ్‌ను ప్రింట్ తీసి పెట్టుకోవాలి.
Indian Navy Recruitment 2019: వేతనాల వివరాలు
సబ్ లెఫ్టనెంట్ (level 10): రూ.56,100 నుంచి రూ.1,10,700
లెఫ్టనెంట్ (level 10B): రూ.61,300 నుంచి రూ.1,20,900
లెఫ్టనెంట్ కమాండర్ (level 11): రూ.69,400 నుంచి రూ.1,36,900
కమాండర్ (level 12A): రూ.1,21,200 నుంచి రూ.2,12,400
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Asus 6Z: ఫ్లిప్ కెమెరాతో ఏసుస్ 6జెడ్... ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:
New Rules: జూలై 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే...
Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో 84,037 ఖాళీలు భర్తీ చేయనున్న కేంద్రం
Air Force Jobs: యువకులకు శుభవార్త... ఆగస్ట్‌లో ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ