Indian Navy Jobs: నేవీలో 2700 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Indian Navy Recruitment 2019 | ఈ పోస్టులకు 60% మార్కులతో 10+2 పాసైనవాళ్లు అర్హులు. మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్‌సైన్స్‌లో ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాలి.

news18-telugu
Updated: July 8, 2019, 12:17 PM IST
Indian Navy Jobs: నేవీలో 2700 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Indian Navy Jobs: నేవీలో 2700 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ నేవీలో 2700 సెయిలర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆర్టిఫిషియర్ అప్రెంటీస్, సీనియర్ సెకండరీ రిక్రూట్స్‌లో 2020 ఫిబ్రవరి బ్యాచ్ సెయిలర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియన్ నేవీ. ఈ పోస్టులకు 60% మార్కులతో 10+2 పాసైనవాళ్లు అర్హులు. మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్‌సైన్స్‌లో ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు joinindiannavy.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి జూలై 10 చివరి తేదీ. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇండియన్ నేవీ సెయిలర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Indian Navy Sailor Recruitment 2019: దరఖాస్తు చేయండి ఇలా...



ముందుగా joinindiannavy.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
మీ ఇమెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవాలి. ముందే రిజిస్టర్ చేసుకున్నట్టైతే నేరుగా లాగిన్ చేయాలి.
అప్లై బటన్ పైన క్లిక్ చేయాలి.
దరఖాస్తు ఫామ్ నింపి, స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఫోటో అప్‌లోడ్ చేయాలి.రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత కాపీ ప్రింట్ తీసుకోవాలి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

NVS Jobs: నవోదయ విద్యాలయ సమితిలో 2370 ఉద్యోగాలు... వివరాలివే

Railway Jobs: రైల్వేలో స్టేషన్ మాస్టర్, టికెట్ క్లర్క్ ఉద్యోగాలు
Published by: Santhosh Kumar S
First published: July 8, 2019, 12:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading