ఇండియన్ నేవీలో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఇండియన్ నేవీ (Indian Navy Jobs) పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. కొచ్చిలోని నావల్ షిప్‌యార్డ్‌లో ఉన్న అప్రెంటీస్ ట్రైనింగ్ స్కూల్‌లో అప్రెంటీస్ పోస్టుల్ని (Apprentice Jobs) భర్తీ చేస్తోంది. మొత్తం 230 పోస్టుల్ని ప్రకటిస్తూ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెకానిక్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 1 చివరి తేదీ. అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
SBI SCO Recruitment 2021: రూ.78,000 వరకు వేతనంతో ఎస్‌బీఐలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
మొత్తం ఖాళీలు | 230 |
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ | 20 |
ఎలక్ట్రీషియన్ | 18 |
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ | 5 |
ఫిట్టర్ | 13 |
మెషినిస్ట్ | 6 |
మెకానిక్ (మోటార్ వెహికిల్) | 5 |
మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ | 5 |
టర్నర్ | 6 |
వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) | 8 |
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ | 3 |
ఫౌండ్రీమ్యాన్ | 1 |
షీట్ మెటల్ వర్కర్ | 11 |
ఎలక్ట్రికల్ వైండర్ | 5 |
కేబుల్ జాయింటర్ | 2 |
సెక్రెటేరియట్ అసిస్టెంట్ | 2 |
ఎలక్ట్రోప్లేటర్ | 6 |
ప్లంబర్ | 6 |
ఫర్నీచర్ అండ్ కేబినెట్ మేకర్ | 7 |
మెకానిక్ డీజిల్ | 17 |
మెకానిక్ (మెరైన్ డీజిల్) | 1 |
మెరైన్ ఇంజిన్ ఫిట్టర్ | 5 |
బుక్ బైండర్ | 4 |
టైలర్ (జనరల్) | 5 |
షిప్‌రైట్ (స్టీల్) | 4 |
పైప్ ఫిట్టర్ | 4 |
రిగ్గర్ | 3 |
షిప్‌రైట్ (వుడ్) | 14 |
మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్యూప్‌మెంట్ మెయింటనెన్స్ | 3 |
ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ | 3 |
టూల్ అండ్ డై మేకర్ | 1 |
సీఎన్‌సీ ప్రోగ్రామర్ కమ్ ఆపరేటర్ | 1 |
డ్రైవర్ కమ్ మెకానిక్ (ఎల్ఎంవీ) | 2 |
పెయింటర్ (జనరల్) | 9 |
టీఐజీ లేదా ఎంఐజీ వెల్డర్ | 4 |
పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ | 3 |
ఎంగ్రేవర్ | 1 |
పెయింటర్ (మెరైన్) | 2 |
మెకానిక్ రేడియో అండ్ రాడార్ ఎయిర్‌క్రాఫ్ట్ | 5 |
మెకానిక్ (ఇన్‌స్ట్రుమెంట్ ఎయిర్‌క్రాఫ్ట్) | 5 |
ఎలక్ట్రీషియన్ (ఎయిర్‌క్రాఫ్ట్) | 5 |
Jobs in Wipro: విప్రోలో ఫ్రెషర్స్‌కి 30,000 ఉద్యోగాలు... ఏడాదికి రూ.3,50,000 వేతనం
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 1
విద్యార్హతలు- మెట్రిక్యులేషన్ లేదా టెన్త్ క్లాస్ 50 శాతం మార్కులతో పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్‌లో 65 శాతం మార్కులతో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 21 ఏళ్ల లోపు
ఎంపిక విధానం- మెట్రిక్యులేషన్ లేదా టెన్త్ క్లాస్‌లో, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం- అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఉన్న దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Admiral Superintendent (for Officer-in-Charge),
Apprentices Training School,
Naval Ship Repair Yard,
Naval Base, Kochi – 682004.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.