కేవలం పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ కొలువు(Central Government Jobs) కొట్టాలనుకుంటున్నారా?.. అయితే మీకో గుడ్‌న్యూస్. ఇండియన్ నేవీ(Indian Navy) తాజాగా 300 సెయిలర్(MR) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు(Online Applications) ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. నవంబర్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండియన్ నేవీ(Indian Navy) అధికారిక వెబ్సైట్ joinindiannavy.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇండియన్ నేవీ కోరింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా కేవలం 1500 మందిని షార్ట్‌లిస్ట్ చేసి వారిక ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. అయితే రాత పరీక్షలో రాష్ట్రాలను బట్టి కటాఫ్ మార్కులు మారే అవకాశం ఉంది.
ఎవరెవరు అర్హులు?
అభ్యర్థులు దేశంలో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2021 మార్చి 31 నాటికి 17 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెయిలర్ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
Step 1: అభ్యర్థులు ముందుగా www.joinindiannavy.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
Step 2: హోమ్‌పేజీలోని కెరీర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ‘క్యాండిడేట్ లాగిన్’పై క్లిక్ చేయండి.
Step 3: ఆపై అన్ని అవసరమైన డీటెయిల్స్‌తో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోండి.
Step 4: లాగిన్ అయిన తర్వాత ‘రిక్రూట్మెంట్ ఫర్ సెయిలర్’పై క్లిక్ చేయండి. అవసరమైన అన్ని వివరాలు, డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి. ఆ తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లించండి.
-భవిష్యత్ అవసరం కోసం అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ అవుట్ తీసుకోండి.
సెలక్షన్ ప్రాసెస్(Selection Process):
రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో సైన్స్ & మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. రాత పరీక్షలో సెక్షన్ A, సెక్షన్ B అనే రెండు విభాగాలుంటాయి. ప్రశ్నలన్నీ 10వ తరగతి స్థాయిలో వస్తాయి. ఈ రాత పరీక్ష కేవలం హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే ఉంటుంది.
Telangana Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణలో ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే
రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ) నిర్వహించి ఎంపిక చేస్తారు. కాగా, ఎంపికైన అభ్యర్థులకు ముందుగా శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో ప్రతినెలా రూ. 14,600 చెల్లిస్తారు. శిక్షణ తర్వాత రెగ్యులర్ ఉద్యోగంలోకి తీసుకుంటారు. అప్పుడు అన్ని అలవెన్సులు కలుపుకొని దాదాపు రూ. 50 వేల జీతం లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Defence Ministry, Government jobs, Indian Navy, Job notification