HOME »NEWS »JOBS & EDUCATION »indian navy mr recruitment 2019 indian navy released notification for sailor posts under matric recruit october 2020 batch know full details ss

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో 400 సెయిలర్ ఉద్యోగాలు... టెన్త్ పాసైతే చాలు

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో 400 సెయిలర్ ఉద్యోగాలు... టెన్త్ పాసైతే చాలు
Indian Navy Jobs: ఇండియన్ నేవీలో 400 సెయిలర్ ఉద్యోగాలు... టెన్త్ పాసైతే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

Indian Navy MR Recruitment 2019 | ఎంపికైనవారికి ఐఎన్ఎస్ చిల్కాలో 2020 అక్టోబర్ నుంచి 15 వారాల పాటు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది. పెళ్లికాని పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి.

  • Share this:
    ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఇప్పటికే నేవీలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఓ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు మరో 400 సెయిలర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. మెట్రిక్ రిక్రూట్ అక్టోబర్ 2020 బ్యాచ్‌లో షెఫ్, స్టివార్డ్, హైజినిస్ట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇండియన్ నేవీ. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. దరఖాస్తుకు 2019 నవంబర్ 28 చివరి తేదీ. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఐఎన్ఎస్ చిల్కాలో 2020 అక్టోబర్ నుంచి 15 వారాల పాటు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది. పెళ్లికాని పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి.

    Indian Navy MR Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 400


    ఖాళీ చేయనున్న పోస్టులు- సెయిలర్ (షెఫ్, స్టివార్డ్, హైజినిస్ట్)
    విద్యార్హత- మెట్రిక్యులేషన్
    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 23
    దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 28
    దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.215. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
    వయస్సు- 2000 అక్టోబర్ 1 నుంచి 2003 సెప్టెంబర్ 30 లోగా జన్మించినవారు దరఖాస్తు చేయొచ్చు.
    స్టైపెండ్- శిక్షణ సమయంలో రూ.14,600.
    వేతనం- రూ.21,700-రూ.69,100.
    సెయిలర్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    BARC Recruitment 2019: విశాఖపట్నం, ముంబైలోని బార్క్‌ కేంద్రాల్లో ఉద్యోగాలు

    CBSE Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... సీబీఎస్ఈలో 357 ఉద్యోగాలు

    ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
    Published by:Santhosh Kumar S
    First published:November 18, 2019, 12:34 IST

    टॉप स्टोरीज