Home /News /jobs /

INDIAN NAVY JOBS IN THE NAVY WITH 10TH CLASS QUALIFICATION APPLICATION PROCESS EVK

Indian Navy Jobs: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో నేవీలో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు విధానం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఇండియన్ నేవీ (Indian Navy) ప‌లు పోస్టుల భ‌ర్తీకి అప్లికేష‌న్‌లు స్వీక‌రిస్తోంది. నేవీ విడుద‌ల చేసిన‌ నోటిఫికేషన్(Notification) ద్వారా.. నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్‌లో ఒక సంవత్సరం పాటు వివిధ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల 275 పోస్టుల భర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు డిసెంబ‌ర్ 5, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    ఇండియన్ నేవీ (Indian Navy) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ  నోటిఫికేషన్(Notification) ద్వారా.. నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్‌లో ఒక సంవత్సరం పాటు వివిధ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల 275 పోస్టుల భర్తీ చేయ‌నున్నారు.  ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ (Onlie) ద్వారా నిర్వ‌హిస్తారు.  “అప్రెంటిస్‌షిప్ శిక్షణ అనేది అభ్యర్థులకు ఒక సారి వ‌చ్చే అవకాశం. అప్రెంటిస్‌షిప్ చట్టం 1961 ప్రకారం ఎవరైనా అభ్యర్థి గతంలో అదే / వేర్వేరు సంస్థల్లో అప్రెంటిస్‌షిప్ (Apprenticeship) శిక్షణ పూర్తి చేసినట్లయితే, వ్యక్తి రెండవసారి అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులు కాదు" అని అధికారిక నోటీస్‌లో పేర్కొన్నారు. ఆసక్తి , అర్హత ఉన్న‌ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ apprenticeshipindia.org లో డిసెంబర్ 5, 2021  వ‌ర‌కు  దరఖాస్తు చేసుకోవచ్చు.

    అర్హ‌త‌లు..
    - అభ్యర్థులు మొత్తం 50 శాతం మార్కులతో SSC, మెట్రిక్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

    DCCB Recruitment 2021: క‌డ‌ప‌ డీసీసీబీలో 75 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, జీతం వివ‌రాలు


    - వారు మొత్తం 65 శాతం మార్కులతో ITI (NCVT/SCVT) కూడా ఉత్తీర్ణులై ఉండాలి.
    - జనరల్ మరియు OBCకి చెందిన అభ్యర్థులు తప్పనిసరిగా ఏప్రిల్ 1, 2001- ఏప్రిల్ 1, 2008 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని).
    - ఎస్సీ మరియు ఎస్టీలకు చెందిన వారు తప్పనిసరిగా ఏప్రిల్ 1, 1996 మరియు ఏప్రిల్ 1, 2008 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని).
    - నౌకాదళ పౌరులు, రక్షణ ఉద్యోగుల పిల్లలు IHQ / MoD (నేవీ) ఆమోదానికి లోబడి రెండేళ్ల అదనపు వయో సడలింపు పొందుతారు.

    ఎంపిక విధానం.. ప‌రీక్ష వివ‌రాలు.

    - ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో కూడిన రాత‌ పరీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించాలి.
    - ఇందులో 50 ప్రశ్నలు ఉంటాయి - గణితం నుంచి 20, జనరల్ సైన్స్ నుంచి 20, జనరల్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు ఒక్కో ప్రశ్నకు ఒకటిన్నర మార్కులు ఉంటాయి.
    - జనవరి 27న పరీక్ష నిర్వహించి జనవరి 29న ఫలితాలు విడుదల చేయనున్నారు.
    - రాత‌పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను వివిధ రిజర్వేషన్ కేటగిరీలు మరియు ట్రేడ్‌లలో ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
    - అభ్యర్థులకు ఆయా ట్రేడ్‌లలో ఉన్న సాంకేతిక నైపుణ్యాల ఆధారంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రక్రియ జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 మధ్య జరుగుతుంది.
    - ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులు ఫిబ్రవరి 7 నుండి 15 మధ్య నిర్వహించబడే వైద్య పరీక్షలో పాల్గొనవలసి ఉంటుంది.

    Job Opportunities: ఈ ఉద్యోగాల‌కు అప్లై చేశారా..? అర్హ‌త‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌


    ద‌ర‌ఖాస్తు విధానం.

    Step 1 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

    Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ apprenticeshipindia.org ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

    Step 3 :  అనంత‌రం హోమ్‌పేజీలో, ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి

    Step 4 :  మీ పేరు మరియు చెల్లుబాటు అయ్యే ఫోన్, ఈమెయిల్ ఐడిని ఉపయోగించి నమోదు చేసుకోండి.

    Step 5 :  దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి

    Step 6 :  అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి

    Step 7 :  అనంత‌రం దరఖాస్తు రుసుము చెల్లించి. అప్లికేష‌న్ స‌బ్‌మిట్ చేయాలి.

    Step 8 :  అనంత‌రం తుప‌రి అవ‌స‌రాల కోసం అప్లికేష‌న్ ఫాంను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి

    Step 9 :  ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 5, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2021, Indian Navy, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు