Jobs: ఇండియన్ నేవీలో సెయిలర్ ఉద్యోగాలు... జనవరి 26 లాస్ట్ డేట్

news18-telugu
Updated: January 24, 2020, 2:23 PM IST
Jobs: ఇండియన్ నేవీలో సెయిలర్ ఉద్యోగాలు... జనవరి 26 లాస్ట్ డేట్
Jobs: ఇండియన్ నేవీలో సెయిలర్ ఉద్యోగాలు... జనవరి 26 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నేవీలో సెయిలర్ పోస్టులకు పెళ్లికాని యువకుల నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది ఇండియన్ నేవీ. స్పోర్ట్స్ కోటా ఎంట్రీలో 01/2020 బ్యాచ్ కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2020 జనవరి 26 చివరి తేదీ. ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, చివరి తేదీ లోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. అథ్లెటిక్స్, స్క్వాష్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, ఫెన్సింగ్ లాంటి క్రీడల్లో ప్రతిభ చూపించినవారు స్పోర్ట్స్ కోటాలో సెయిలర్ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ https://www.joinindiannavy.gov.in/ ఓపెన్ చేసి చూడొచ్చు.

Indian Navy Sailor Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



భర్తీ చేయనున్న పోస్టులు- డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్, సీనియర్ సెకండరీ రిక్రూట్‌-SSR, మెట్రిక్ రిక్రూట్-MR
విద్యార్హత- ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష పాసవ్వాలి.
క్రీడలు- క్రీడల్లో యూనివర్సిటీ టోర్నమెంట్, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనాలి.
వయస్సు- 17 నుంచి 22 ఏళ్లు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:The Secretary, Indian Navy Sports Control Board,
7th Floor, Chankya Bhavan,
Integrated Headquarters, Mod (Navy),
New Delhi 110021.
నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SBI Jobs: ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా...

Indian Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో 138 జాబ్స్... ఖాళీల వివరాలివే

Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
Published by: Santhosh Kumar S
First published: January 24, 2020, 2:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading