Indian Navy Jobs: ఇంటర్ పాసైతే ఇండియన్ నేవీలో చేరే అవకాశం.. అప్లై చేయండి ఇలా

Indian Navy 10+2 Cadet Entry Scheme | దరఖాస్తుకు డిసెంబర్ 19 చివరి తేదీ. ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ www.joinindiannavy.gov.in ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి.

news18-telugu
Updated: November 26, 2019, 5:06 PM IST
Indian Navy Jobs: ఇంటర్ పాసైతే ఇండియన్ నేవీలో చేరే అవకాశం.. అప్లై చేయండి ఇలా
Indian Navy Jobs: ఇంటర్ పాసైతే ఇండియన్ నేవీలో చేరే అవకాశం.. అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇంటర్ పాసైనవారికి శుభవార్త. ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో చేరడానికి మంచి అవకాశమిది. ఇండియన్ నేవీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ప్రకటించింది. ఎంపికైనవారు నాలుగేళ్ల బీటెక్ కోర్సు చేయడానికి అవకాశం లభిస్తుంది. పెళ్లికాని అబ్బాయిలు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. కేరళలోని నావల్ అకాడమీలో 2020 జూలైలో బ్యాచ్ ప్రారంభమవుతుంది. నవంబర్ 29న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తుకు డిసెంబర్ 19 చివరి తేదీ. ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ www.joinindiannavy.gov.in ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. ఎంపికైనవారికి విశాఖపట్నం, బెంగళూరు, భోపాల్, కొయంబత్తూరులో 2020 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య ఇంటర్వ్యూలు ఉంటాయి.

Indian Navy 10+2 Cadet Entry Scheme: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 37
దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 29
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 19
విద్యార్హత- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో 70% మార్కులు, ఇంగ్లీష్‌లో 50% మార్కులతో 10+2 పాస్ కావాలి. జేఈఈ మెయిన్ 2019 పరీక్షకు హాజరైనవారు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు దరఖాస్తు చేయొచ్చు.
వయస్సు- 2001 జనవరి 2 నుంచి 2003 జూలై 1 మధ్య జన్మించాలి.నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo U20: ఆకట్టుకునే ఫీచర్లతో వివో యూ20... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: ఈశాన్య రైల్వేలో 1104 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు

Jobs: ఇంటర్ పాసైతే ఇండియన్ ఆర్మీలో జాబ్... అమ్మాయిలకు మాత్రమే

Railway Jobs: సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 జాబ్స్... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే
Published by: Santhosh Kumar S
First published: November 26, 2019, 2:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading