ఇంటర్మీడియట్ పాసైనవారికి గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. జూలై 2021 సెషన్ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనుంది ఇండియన్ నేవీ. ఎడ్యుకేషన్, ఎగ్జిక్యూటీవ్, టెక్నికల్ బ్రాంచ్‌లల్లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2021 జనవరి 29న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 9 చివరి తేదీ. పెళ్లికాని యువకులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఈ వెబ్సైట్లోనే అప్లై చేయాలి.
Indian Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 358 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
DRDO Jobs 2021: డీఆర్డీఓలో 69 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
ఎంపికైన అభ్యర్థులు 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా బీటెక్ కోర్సు చేయొచ్చు.కేరళలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నాలుగేళ్ల కోర్సు ఉంటుంది. అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బీటెక్ కోర్సు చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి జవరహ్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి బీటెక్ డిగ్రీ వస్తుంది.
MIDHANI Recruitment 2021: నెల్లూరులోని మిధాని యూనిట్లో ఉద్యోగాలు... రూ.72,000 వరకు వేతనం
Army Recruitment Rally: ఆర్మీ ఉద్యోగాలకు తెలంగాణలో రిక్రూట్మెంట్ ర్యాలీ... అప్లై చేయండిలా
Indian Navy 10+2 (B.Tech) Cadet Entry Scheme 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
మొత్తం ఖాళీలు- 26
ఎడ్యుకేషన్ బ్రాంచ్- 5
ఎగ్జిక్యూటీవ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్- 21
కోర్సులు- అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బీటెక్ కోర్సు
దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 29
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 9
ఇంటర్వ్యూ- 2021 మార్చి నుంచి జూన్ వరకు
విద్యార్హత- 10+2 లేదా తత్సమాన పరీక్ష పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో కనీసం 70% మార్కులు ఉండాలి. ఇంగ్లీష్‌లో 50% మార్కులుండాలి. జేఈఈ మెయిన్ 2020 ఎగ్జామ్ పాస్ కావాలి.
వయస్సు- 2002 జనవరి 2 నుంచి 2004 జూలై 1 మధ్య జన్మించినవారు అప్లై చేయాలి.
ఎంపిక విధానం- జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ రెండు దశల్లో ఉంటుంది. స్టేజ్ 1 లో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. స్టేజ్ 1 క్వాలిఫై అయినవారికి సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ ఉంటాయి. రెండు దశల ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేసిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
ఇంటర్వ్యూ నిర్వహించే ప్రాంతం- విశాఖపట్నం, కోల్‌కతా, భోపాల్, బెంగళూరు.