ఇండియన్ నేవీలో ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా పలు ఖాళీలను భర్తీ చేస్తోంది ఇండియన్ నేవీ. 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌ను ప్రకటించింది. మొత్తం 34 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 అక్టోబర్ 6న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 20 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ 2020 పరీక్ష రాసినవారు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేయడానికి పెళ్లి కాని యువకులకు మాత్రమే అర్హత ఉంటుంది. ఎంపికైనవారు 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా కేరళలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నాలుగేళ్ల బీటెక్ కోర్సు చేయొచ్చు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసినవారిని ఎడ్యుకేషన్, ఎగ్జిక్యూటీవ్, టెక్నికల్ బ్రాంచ్‌లల్లో నియమిస్తుంది ఇండియన్ నేవీ.
Railway Jobs: రైల్వే సంస్థలో 1000 జాబ్స్... దరఖాస్తుకు మూడు రోజులే గడువు
RRB NTPC: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అప్లికేషన్ స్టేటస్ లింక్ ఇదే... చెక్ చేయండి ఇలా
Indian Navy 10+2 (B.Tech) Cadet Entry Scheme: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
మొత్తం ఖాళీలు- 34
ఎడ్యుకేషన్ బ్రాంచ్- 5
ఎగ్జిక్యూటీవ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్- 29
దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 6
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 20
ఇంటర్వ్యూ- 2020 నవంబర్ నుంచి 2021 జనవరి మధ్య
విద్యార్హత- 10+2 లేదా తత్సమాన పరీక్ష పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో కనీసం 70% మార్కులు ఉండాలి. ఇంగ్లీష్‌లో 50% మార్కులుండాలి.
వయస్సు- 2001 జూలై 2 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించినవారు అప్లై చేయాలి.
ఎంపిక విధానం- జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ రెండు దశల్లో ఉంటుంది. స్టేజ్ 1 లో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. స్టేజ్ 1 క్వాలిఫై అయినవారికి సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ ఉంటాయి. రెండు దశల ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేసిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
ఇంటర్వ్యూ నిర్వహించే ప్రాంతం- విశాఖపట్నం, బెంగళూరు, కోల్‌కతా, భోపాల్.