హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Indian Navy: ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటిదాక అప్లై చేసుకోవచ్చంటే..?

Indian Navy: ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటిదాక అప్లై చేసుకోవచ్చంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశ యువతకు త్రివిధ దళాల్లో అవకాశం కల్పించేందుకు కేంద్రం అగ్నిపథ్‌ స్కీమ్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జరుగుతున్న ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR/MR 01/23 రిక్రూట్‌మెంట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును తాజాగా పొడిగించారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

భారతదేశ యువతకు త్రివిధ దళాల్లో అవకాశం కల్పించేందుకు కేంద్రం అగ్నిపథ్‌ స్కీమ్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జరుగుతున్న ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR/MR 01/23 రిక్రూట్‌మెంట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును తాజాగా పొడిగించారు. ఇప్పుడు అభ్యర్థులు డిసెంబర్ 28 వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు www.joinindiannavy.gov.inలో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1500 స్థానాలను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో 1400 మందిని అగ్నివీర్(SSR)- 01/2023 బ్యాచ్‌లోకి తీసుకుంటారు. 100 ఖాళీలు అగ్నివీర్(MR)- 01/2023 బ్యాచ్‌కు చెందినవి. అగ్నివీర్(SSR) అభ్యర్థుల వయస్సు రిజిస్టర్‌ చేసుకొనే తేదీ నాటికి 17½ నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.

విధుల్లో నాలుగు సంవత్సరాలు

డిసెంబర్ 8న ప్రారంభమైన ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 100 ఖాళీను భర్తీ చేస్తారు. ఇందులో మహిళలకు 20 స్థానాలను రిజర్వు చేశారు. అవివాహిత అభ్యర్థులకు మాత్రమే రిక్రూట్‌మెంట్‌కు అర్హత ఉంది. ఇండియన్ నేవీ ఓ ఉద్యోగ ప్రకటనలో.. అగ్నివీర్స్ నేవీ యాక్ట్ 1957 ప్రకారం ఇండియన్ నేవీలో నాలుగు సంవత్సరాల పాటు అభ్యర్థులను నియమిస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

మొదటగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ joinindiannavy.gov.in ఓపెన్‌ చేయాలి. అనంతరం హోమ్‌పేజీలో కనిపించే ‘క్లిక్‌ హియర్‌ టూ అప్లై ఫర్‌ అగ్నివీర్‌ 01/23’ లింక్‌పై క్లిక్‌ చేయాలి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి అప్లికేషన్‌ ప్రాసెస్‌ కొనసాగించాలి. అవసరమైన అన్ని వివరాలను ఎంటర్‌ చేయాలి. సంబంధిత డాక్యుమెంట్‌లను అప్‌లోడ్‌ చేయాలి. తర్వాత అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. చివరిగా అప్లికేషన్‌ ఫారమ్‌ను సబ్మిట్‌ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్‌ అవుట్‌ తీసుకోవాలి.

సెలక్షన్‌ ప్రాసెస్‌

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. అగ్నివీర్(MR)- 01/2023 బ్యాచ్ ఎంపిక ప్రక్రియ మూడు దశలుగా ఉంటుంది. మొదట కంప్యూటర్ బేస్డ్‌ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత రాత పరీక్ష, ఫిజికట్‌ ఫిట్నెస్‌ టెస్ట్‌, ఇనిషియల్‌ మెడికల్‌ టెస్ట్‌ ఉంటుంది. ఫైనల్ రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్‌తో పూర్తవుతుంది.

TSPSC Notifications: ఈ వారంలో గ్రూప్ 2, 3తో పాటు.. మరో రెండు నోటిఫికేషన్లు.. డిసెంబర్ 23లోపే గ్రూప్ 1 ఫలితాలు..

జీతం ఎలా ఉంటుంది?

ఈ రిక్రూట్‌మెంట్‌లో సెలక్ట్‌ అయిన అభ్యర్థులకు నిర్ణీత వార్షిక ఇంక్రిమెంట్‌తో నెలకు రూ.30,000 జీతం అందుకొనే అవకాశం ఉంది. అనుకోని ప్రమాదాలు, దుస్తులు, ప్రయాణ ఖర్చులకు కూడా పరిహారం అందజేస్తారు. అభ్యర్థుల సొంత అభ్యర్థన మేరకు అగ్నివీర్లను సేవల నుంచి రిలీజ్‌ చేయరని గుర్తించాలి. అయితే అసాధారణమైన పరిస్థితులలో, సంబంధిత అధికారుల అంగీకారంతో అగ్నివీర్ సర్వీస్‌ నుంచి రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

First published:

Tags: Indian, Indian Navy, JOBS, Students

ఉత్తమ కథలు