Home /News /jobs /

INDIAN NAVY AGNIVEER MR 2022 APPLICATION PROCESS BEGINS TODAY CHECK DETAILS HERE AND KNOW APPLICATION PROCESS VB

Indian Navy Recruitment: అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. మహిళలకు కూడా అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అగ్నివీర్ పోస్టుల కొరకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అవివాహిత పురుష అండ్ స్త్రీ అభ్యర్థులు అగ్నివీర్ MR పోస్ట్ కోసం దాని అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలిలా..

అగ్నివీర్ పోస్టుల కొరకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అవివాహిత పురుష అండ్ స్త్రీ అభ్యర్థులు అగ్నివీర్ MR పోస్ట్ కోసం దాని అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలిలా.. అగ్నివీర్ పోస్టుల కొరకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ నేవీ 01/2022 (డిసెంబర్ 22) బ్యాచ్ కోసం 200 అగ్నివీర్ (MR) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో 40 పోస్టుల ఉమెన్స్ కు కేటాయించారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

SI Prelims Preparation: ఎస్ఐ ప్రిలిమ్స్ లో నెగెటివ్ మార్కులు ఉన్నా.. ఇలా ప్రపేర్ అయితే అర్హత సాధించొచ్చు..


పోస్టుల వివరాలిలా.. 

పోస్ట్: అగ్నివీర్ (సెయిలర్స్ (MR) – డిసెంబర్ 2022 బ్యాచ్)

ఖాళీల సంఖ్య: 200 (40 స్త్రీలు)

పే స్కేల్: నెలకు రూ. 30,000 వేతనంగా ఇవ్వనున్నారు.

అర్హత ప్రమాణాలు: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి 10వ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01 డిసెంబర్ 1999 నుండి 31 మే 2000 మధ్య జన్మించిన వారు అర్హులు.



ఎలా దరఖాస్తు చేయాలి:

- joinindiannavy.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి

- తర్వాత రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.

- మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవపోతే నమోదు చేసుకోవచ్చు.

- ఆపై ఆధారాలను నమోదు చేయడం ద్వారా లాగిన్ చేసుకోవచ్చు.

- తర్వాత ఫీజు చెల్లించి..  వివరాలను నమోదు చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అయినట్టే.

అభ్యర్థులు భవిష్యత్తు సూచన కోసం అదే కాపీని డౌన్‌లోడ్ చేసి ఉంచుకోవాలని నోటిఫికేషన్ లో సూచించారు. రాత పరీక్ష/PFTకి హాజరు కావడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ ఎగ్జామ్, మెడికల్ ఎగ్జామ్‌లలో అర్హత ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. కటాఫ్ మార్కులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు.  ఫిజికల్ టెస్ట్ లో మహిళలు 8 నిమిషాల్లో 1600 మీటర్లు పరుగు పూర్తి చేయాలి. అదే పురుష అభ్యర్థులకు అయితే 6 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి ప్రారంభ తేదీ: జూలై 25, 2022

ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: జూలై 30, 2022

రాత పరీక్ష తేదీ: నవంబర్ 2022లో ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, క్వాలిఫైయింగ్ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT) మరియు మెడికల్ ఎగ్జామినేషన్‌లలో ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.
Published by:Veera Babu
First published:

Tags: Agnipath Scheme, Career and Courses, Indian, Indian Navy, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు