ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో ఉన్న ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. మొత్తం 188 ఉద్యోగాలు ఉన్నాయి. కుక్, డ్రైవర్, వెయిటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, గ్రూమ్, బార్బర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (Application Process) కొనసాగుతోంది. అభ్యర్థులు 45 రోజుల్లో దరఖాస్తు చేయాలి. ఆఫ్‌లైన్ పద్ధతిలో అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తుల్ని పంపాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలతో పాటు విద్యార్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి.
Andhra Pradesh Jobs: రూ.53,500 వేతనంతో ఆంధ్రప్రదేశ్‌లో 896 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు | 188 | విద్యార్హతలు | వేతనం |
కుక్ స్పెషల్ | 12 | మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. భారతీయ వంటకాలు వండటం తెలిసి ఉండాలి. | రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది. |
కుక్ ఐటీ | 3 | మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. భారతీయ వంటకాలు వండటం తెలిసి ఉండాలి. | రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది. |
ఎంటీ డ్రైవర్ | 10 | మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. | రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది. |
బూట్ మేకర్, రిపేరర్ | 1 | మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. | రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది. |
లోయర్ డివిజన్ క్లర్క్ | 3 | 12వ తరగతి పాస్ కావాలి. ఇంగ్లీష్ టైపింగ్ లేదా హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. | రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది. |
మసాల్చీ | 2 | మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. | రూ.18,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.56,900 వేతనం లభిస్తుంది. |
వెయిటర్ | 11 | మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. | రూ.18,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.56,900 వేతనం లభిస్తుంది. |
ఫటిగ్మ్యాన్ | 21 | మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. | రూ.18,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.56,900 వేతనం లభిస్తుంది. |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 28 | మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. | రూ.18,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.56,900 వేతనం లభిస్తుంది. |
గ్రౌండ్స్‌మ్యాన్ | 46 | మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. | రూ.18,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.56,900 వేతనం లభిస్తుంది. |
జీసీ ఆర్డర్లీ | 33 | మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. | రూ.18,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.56,900 వేతనం లభిస్తుంది. |
గ్రూమ్ | 7 | మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. | రూ.18,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.56,900 వేతనం లభిస్తుంది. |
బార్బర్ | 2 | మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. | రూ.18,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.56,900 వేతనం లభిస్తుంది. |
ఎక్విప్మెంట్ రిపేరర్ | 1 | మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. | రూ.18,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.56,900 వేతనం లభిస్తుంది. |
బైస్కిల్ రిపేరర్ | 3 | మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. | రూ.18,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.56,900 వేతనం లభిస్తుంది. |
ల్యాబరేటరీ అటెండెంట్ | 1 | మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. | రూ.18,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.56,900 వేతనం లభిస్తుంది. |
దరఖాస్తుకు చివరి తేదీ- నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 45 రోజులలోపు అప్లై చేయాలి.
ఎంపిక విధానం- రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- ఎంటీ డ్రైవర్, ల్యాబ్ అటెండెంట్, జీసీ ఆర్డర్లీ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల లోపు. ఇతర పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల లోపు.
దరఖాస్తు ఫీజు- రూ.50
దరఖాస్తు విధానం- అభ్యర్థులు నోటిఫికేషన్ చివర్లో ఉన్న దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.
ఈ జాబ్ నోటిఫికేషన్, దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Commandant,
Indian Military Academy,
Dehrudun,
Uttarakhand.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS, Private Jobs