హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Jobs 2022: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. 

AP Jobs 2022: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. 

AP Jobs 2022: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. 

AP Jobs 2022: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. 

AP Jobs 2022: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి పలు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలుసుకోండి. 

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి తన అధికారిక వెబ్‌సైట్ iittp.ac.inలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ - సిస్టమ్స్, జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్, జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్, జూనియర్ టెక్నికల్ వంటి 39 నాన్ టీచింగ్ పోస్టుల కోసం తాజాగా నోటిఫికేషన్‌ను(Notification) విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ అనేది 10 అక్టోబర్ నుంచి మొదలైంది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 10, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.  ఈ ఖాళీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.  ముఖ్యమైన తేదీలు, ఖాళీల వివరాలు, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ మొదలైన వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

మొత్తం పోస్టుల సంఖ్య - 39

విభాగాల వారీగా ఇలా.. 

అసిస్టెంట్ రిజిస్ట్రార్ 02

జూనియర్ సూపరింటెండెంట్ 05

జూనియర్ అసిస్టెంట్ 13

టెక్నికల్ ఆఫీసర్ 01

జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్ 01

జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్ 01

జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ 06

జూనియర్ ఇంజనీర్ 02

జూనియర్ టెక్నీషియన్ 07

జూనియర్ హిందీ అసిస్టెంట్ Gr.1 01

మొత్తం 39

Highcourt 10 Job Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైకోర్టు నుంచి 3600లకు పైగా పోస్టులు.. 10 నోటిఫికేషన్స్ విడుదల..

అర్హతలు..

అసిస్టెంట్ రిజిస్ట్రార్..  8 సంవత్సరాల సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.

జూనియర్ సూపరింటెండెంట్..  అడ్మినిస్ట్రేటివ్ రంగంలో 6 సంవత్సరాల అనుభవంతో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ.

జూనియర్ అసిస్టెంట్..  కంప్యూటర్ ఆపరేషన్స్ పరిజ్ఞానంతో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ.

టెక్నికల్ ఆఫీసర్..  CSE/ ECE/ IT/ సాఫ్ట్‌వేర్ సైన్సెస్‌లో BE/ B. Tech/ M. Sc పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు.. అడ్మినిస్ట్రేషన్ వంటి రంగాల్లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎంసీఏ పూర్తి చేసిన వారు కూడా అర్హులుగా పేర్కొన్నారు.

జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్.. సంబంధిత లైబ్రరీలో 6 సంవత్సరాల అనుభవంతో M.Lib.Sc/ MLISతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంఎల్ఐసీలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్.. M.Lib.Sc/ MLISతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్..  సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.  జూనియర్ ఇంజనీర్ మెకానికల్ / సివిల్ ఇంజనీరింగ్‌లో BE/ B.Tech లేదా తత్సమానం. మెకానికల్/సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు 5 సంవత్సరాల సంబంధిత అనుభవం ఉండాలి.

TSLPRB Part 2 Application Documents: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. పార్ట్ 2 అప్లికేషన్స్ కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

జూనియర్ టెక్నీషియన్..  B.Sc (CS)/ BCA/ కంప్యూటర్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ నెట్‌వర్క్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా మరియు 2 సంవత్సరాల సంబంధిత అనుభవం  ఉండాలి. లేదా

కెమిస్ట్రీలో బ్యాచిలర్స్ డిగ్రీ (OR)

3 సంవత్సరాల డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ (OR)

మెకానికల్ ఇంజనీరింగ్‌లో 3-సంవత్సరాల డిప్లొమా లేదా వెల్డింగ్/మెషీన్‌లతో వెల్డింగ్ ట్రేడ్/మెకానిస్ట్ ట్రేడ్‌లో 2 సంవత్సరాల ITI ఉండాలి.

జూనియర్ హిందీ అసిస్టెంట్ Gr.1..  హిందీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్ తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్‌ ఉండాలి. లేదా డిగ్రీ స్థాయిలో పరీక్ష మాధ్యమంగా ఉండాలి.  కనీసం 3 సంవత్సరాల సంబంధిత అనువాద అనుభవాలు హిందీ నుండి ఇంగ్లీషుకు మరియు వైస్ వెర్సా ఉండాలి. ఇంగ్లీష్ మరియు హిందీ టైప్ రైటింగ్ పరిజ్ఞానం కూడా ఉండాలి.

వయో పరిమితి

అభ్యర్థుల వయోపరిమితి 27 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు.. 

UR/OBC అభ్యర్థులు.. గ్రూప్ A పోస్టులకు  రూ. 500, గ్రూప్ బి పోస్టులకు రూ. 300, గ్రూప్ సి పోస్టులకు రూ. 200 చెల్లించాలి. SC/ST/మహిళ/మాజీ-SM/PWD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజును మినహాయించారు.

ఎంపిక విధానం.. అభ్యర్థుల తుది ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

PM Modi-Rozgar Mela: పండుగ వేళ.. ఉద్యోగాల మేళ.. ప్రారంభించిన ప్రధాని మోదీ ..

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

- ముందుగా అభ్యర్థులు IIT తిరుపతి అధికారిక వెబ్‌సైట్ www.iittp.ac.inని సందర్శించండి.

-నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి, జాగ్రత్తగా చదవండి.

-దరఖాస్తు ఆన్‌లైన్ బటన్‌పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలను ఇవ్వడం ద్వారా మీ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

-పత్రాలను అప్‌లోడ్ చేయండి (అవసరం మేరకు)

-అప్లికేషన్ ఫీజు చెల్లింపు చేయండి.

-దరఖాస్తులో పేర్కొన్న వివరాలను ఇచ్చి.. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.

- దీన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

నోటిఫికేషన్ PDF కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

First published:

Tags: Andhra Pradesh, Career and Courses, JOBS, Jobs in ap

ఉత్తమ కథలు