IIT Jobs: ఖరగ్‌పూర్ ఐఐటీలో 88 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

IIT Recruitment 2020 | ఐఐటీ ఖరగ్‌పూర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 88 పోస్టుల్ని ప్రకటించింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: February 22, 2020, 10:15 AM IST
IIT Jobs: ఖరగ్‌పూర్ ఐఐటీలో 88 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
IIT Jobs: ఖరగ్‌పూర్ ఐఐటీలో 88 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఐఐటీ ఖరగ్‌పూర్ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇటీవల ఐఐటీ హైదరాబాద్ 152 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఖరగ్‌పూర్‌లోని ఐఐటీ నాన్ టీచింగ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 24 చివరి తేదీ. మొత్తం 88 ఖాళీలను ప్రకటించింది. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. పోస్టును బట్టి రూ.1,12,400 వరకు వేతనం ఉంటుంది. ఐఐటీ ఖరగ్‌పూర్ అధికారిక వెబ్‌సైట్‌ http://www.iitkgp.ac.in ఓపెన్ చేసి ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా హార్డ్ కాపీ పంపాల్సి ఉంటుంది.

IIT Recruitment 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 88

జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్- 6
జూనియర్ ఎగ్జిక్యూటీవ్- 22
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్- 1


మెడికల్ ల్యాబరేటరీ టెక్నీషియన్- 2సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 2
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్- 5
జూనియర్ టెక్నీషియన్ / జూనియర్ ల్యాబరేటరీ అసిస్టెంట్- 59
డ్రైవర్ గ్రేడ్ 2- 1

IIT Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 14
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 24
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Assistant Registrar (E-III),
Indian Institute of Technology,
Kharagpur-721302,
West Bengal, India.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SBI Jobs: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలు... ఎగ్జామ్ సిలబస్ ఇదే

UPSC Jobs 2020: యూపీఎస్‌సీ నుంచి 886 పోస్టుల భర్తీ... అప్లై చేయండిలా

Telangana Jobs: తెలంగాణలో 1466 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

Andhra Pradesh Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు

 
First published: February 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు