• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • INDIAN INSTITUTE OF TECHNOLOGY IIT BOMBAY HAS RELEASED THE RESPONSE SHEET OF GATE 2021 NS

GATE 2021: గేట్ అభ్యర్థులకు అలర్ట్.. రెస్పాన్స్ షీట్లు విడుదల.. ఈ లింక్ తో డౌన్ లోడ్ చేసుకోండి

GATE 2021: గేట్ అభ్యర్థులకు అలర్ట్.. రెస్పాన్స్ షీట్లు విడుదల.. ఈ లింక్ తో డౌన్ లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

GATE Response Sheet 2021: గేట్ 2021కి సంబంధించిన రెస్పాన్స్ షీట్లను అధికారులు ఈ రోజు విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఫిబ్రవరి 6, 7, 13, 14 తేదీల్లో GATE 2021 పరీక్షను ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT Bombay) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 8,82,684 మంది అభ్యర్థులు M.E, M.Tech, M.Arch, Ph.D లో ప్రవేశాల కోసం అప్లై చేశారు. అయితే 78 శాతం మంది మాత్రమే పరీక్షకు హాజరైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. గతేడాది సైతం దాదాపు ఇంతే హాజరు నమోదైంది. అయితే ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు జవాబు పత్రాలు (response sheets) కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అధికారులు రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. gate.iitb.ac.in వెబ్ సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లను చూడొచ్చు. అయితే గేట్ 2021 ఫలితాలను మార్చి 22న అధికారులు విడుదల చేయనున్నారు.

    GATE 2021 Response Sheetను ఎలా డౌన్ లోడ్ చేయాలంటే..
    -అభ్యర్థులు మొదట gate.iitb.ac.in ను ఓపెన్ చేయాలి.
    -“responses of candidates are available” అనే ఓ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. అక్కడ అభ్యర్థులు క్లిక్ చేయాలి.
    -అక్కడ ఎన్ రోల్మెంట్ ఐడీ, పాస్ వర్డ్ తదితర వివరాలతో లాగిన్ అవ్వాలి.
    -అనంతరం మీ రెస్పాన్స్ షీట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: